https://oktelugu.com/

మోస్ట్ హాట్ జోడీ నుండి బోల్డ్ సినిమా !

తెలుగు బుల్లితెర పై మోస్ట్ హాట్ జోడీ ఎవరంటే కచ్చితంగా ముందు చెప్పే జోడీ ‘రష్మీ-సుడిగాలి సుధీర్’. వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ముందు టిఆర్పి రేటింగ్ ఓ రేంజ్ లో వస్తోంది. ఇక వీళ్లిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతోందని ఇప్పటికీ చాలా రకాలుగా పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, రష్మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం ఉంది. తమ జోడికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా.. ఇద్దరూ అదే ఫీల్‌ను కొనసాగిస్తూ […]

Written By:
  • admin
  • , Updated On : February 3, 2021 / 06:05 PM IST
    Follow us on


    తెలుగు బుల్లితెర పై మోస్ట్ హాట్ జోడీ ఎవరంటే కచ్చితంగా ముందు చెప్పే జోడీ ‘రష్మీ-సుడిగాలి సుధీర్’. వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ముందు టిఆర్పి రేటింగ్ ఓ రేంజ్ లో వస్తోంది. ఇక వీళ్లిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతోందని ఇప్పటికీ చాలా రకాలుగా పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, రష్మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం ఉంది. తమ జోడికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా.. ఇద్దరూ అదే ఫీల్‌ను కొనసాగిస్తూ బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. కాగా తాజాగా ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు.

    Also Read: డిజిటల్ & శాటిలైట్ రైట్స్ లో మహేష్ సరికొత్త రికార్డ్ !

    కాగా ఈ విషయాన్ని స్వయంగా సుడిగాలి సుధీర్ బయటపెట్టాడు. రష్మీ తాను కలిసి ఆన్ స్క్రీన్ మీద కలిసి నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నామని సుధీర్ తెలిపాడు. ఇందుకు సంబంధించి తామిద్దరం కథలు వింటున్నామని.. ఇద్దరికి నచ్చిన కథ దొరికిన వెంటనే సినిమా ఉంటుందని సుధీర్ క్లారిటీ ఇచ్చాడు. కచ్చితంగా లవ్ స్టోరీనే చేయాలనే ఆలోచన తమకు లేదని.. అయితే మంచి కథ మాత్రం ఉండాలని ఆలోచన ఇద్దరికీ ఉందని చెప్పుకొచ్చాడు. సుధీర్ మాటలకు బట్టి చూస్తే.. ఈ ఏడాది ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా మొదలవుతుందని అర్థమవుతోంది.

    Also Read: మరో క్రేజీ మల్టీస్టారర్ కి రంగం సిద్ధం !

    నిజానికి గత సంవత్సరమే వీళ్ళతో సినిమా చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. అయితే అప్పుడు కథ నచ్చక వీళ్ళు ఒప్పుకోలేదట. కాగా తాజాగా ప్రకాష్ అనే నూతన డైరెక్టర్ తో ఓ బోల్డ్ సినిమాని ఫైనల్ చేశారట. త్వరలోనే వీళ్ళు కలసి ఒక సినిమా కూడా చేయబోతున్నారు. మరి బుల్లితెర పై లాగే వెండితెర పై కూడా ఈ జంట బాగా అలరిస్తుందేమో చూడాలి. ఏమైనా ఈ హాట్ జోడీని వెండితెర పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చాన్నాళ్లుగా జరుగుతున్నా.. ఎట్టకేలకు ఇప్పటికి సినిమా సెట్ అయింది. కాకపోతే వీళ్ళకు వెండితెర ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి. ఇక ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా ఒక సినిమా చేశాడు. రష్మి కూడా హీరోయిన్ గా నాలుగైదు బి గ్రేడ్ సినిమాలు చేసింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్