కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ ఆలస్యమైతే ప్రమాదమా..?

మన దేశంతో పాటు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ లో వేగంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వ్యాక్సినేషన్ పంపిణీ వేగంగా జరగకపోవడం వల్లే రికార్డు స్థాయిలో మరణాలు, కేసులు నమోదవుతున్నాయని చాలామంది భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరిగితే మాత్రమే కరోనాకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రజల అవసరాలకు సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. అయితే నిపుణులు రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచాలని సూచనలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ఒక […]

Written By: Navya, Updated On : May 21, 2021 4:50 pm
Follow us on

మన దేశంతో పాటు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ లో వేగంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. వ్యాక్సినేషన్ పంపిణీ వేగంగా జరగకపోవడం వల్లే రికార్డు స్థాయిలో మరణాలు, కేసులు నమోదవుతున్నాయని చాలామంది భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరిగితే మాత్రమే కరోనాకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రజల అవసరాలకు సరిపడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది.

అయితే నిపుణులు రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచాలని సూచనలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్నా మహమ్మారి నుంచి రక్షణ కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రెండు డోస్ ఆలస్యమైతే ప్రమాదం లేదని ఆలస్యంగా రెండో డోస్ తీసుకోవడం వల్లే మేలు జరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలా చేయడం వల్ల తొలి డోస్ వల్ల ఏర్పడే యాంటీబాడీల స్థాయిలు 20 శాతం నుంచి 300 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ప్రముఖ వైరాలజిస్ట్ లలో ఒకరైన గ్రెగరీ పోలండ్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. వేగంగా ఎక్కువమందికి తొలి డోసు టీకా ఇవ్వడం వల్ల శరీరంలోని రక్షణ వ్యవస్థ బలపడుతుందని రెండో డోస్ తీసుకున్న తరువాత ఇమ్యూనిటీ సిస్టమ్ మెరుగ్గా స్పందించి దృఢంగా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే తక్కువ సామర్థ్యం ఉన్న వ్యాక్సిన్లను మాత్రం వేగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ విరామం పెంచితే తొలి డోస్ తీసుకున్న వాళ్లు రెండో డోస్ తీసుకోవడానికి ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.