కరోనా సెకెండ్ వేవ్ కారణంగా షూటింగులకు విరామాలు రావడంతో, ఈ గ్యాప్ లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది ‘శ్రియ’. ఎప్పుడో రెండు దశాబ్దాల కిందట సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, పెద్దగా అందం లేకపోయినా అదృష్టం బాగుండి, కెరీర్ ను సక్సెస్ ఫుల్ ఇంకా కొనసాగించడమే కాకుండా.. సౌత్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ ఆడిపాడింది. పైగా బాలీవుడ్ లోనూ పలువురు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా మెరిసింది.
ఇక తనకు సినిమాలు తగ్గాయని అర్ధమవ్వగానే, ఒక విదేశీయుడిని చూసుకుని చక్కగా అతన్ని పెళ్లి చేసుకుని అతనితో బార్సిలోనాలోనే నివసిస్తూ.. సినిమాలలో ఛాన్స్ లు వచ్చినప్పుడు హైదరాబాద్, చెన్నై చుట్టూ తిరుగుతూ కాలక్షేపం చేస్తోంది ఈ ముదురు భామ. అయితే, ఈ సీనియర్ బ్యూటీకి ఇప్పటికీ కొన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. పైగా ఆర్ఆర్ఆర్ లో కూడా నటిస్తోంది.
ఆ సినిమా చెప్పుకుని మరో పది సినిమాలు తెచ్చుకో గలదు. ప్రస్తుతం శ్రియ ఆ పనిలో ఉంది. హీరోయిన్ గా తనకున్న ఎక్స్ పీరియన్స్ ను పరిచయాలను అడ్డం పెట్టుకుని స్టార్ హీరోలతో టచ్ లోకి వెళ్తుంది. నాగార్జున, ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఉంది. ఆ పాత్రలో త్రిషను తీసుకోవాలని దర్శకుడు భావించాడు.
ఈ విషయం తెలుసుకున్న శ్రియ మొత్తానికి నాగ్ కి ఫోన్ చేసి, మనది హిట్ కాంబినేషన్, మనం సినిమాలో మన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది కూడా, అందుకే ఆ క్యారెక్టర్ నాకు ఇప్పించండి అంటూ నాగార్జునను రిక్వెస్ట్ చేసిందట. సహజంగా హీరోయిన్స్ విషయంలో నాగ్ చాల కూల్ గా ఉంటాడు. ఎప్పుడు వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే శ్రియకు తన కొత్త సినిమాలో అవకాశం ఇప్పించాడు. ఈ వార్తకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. శ్రియ నాగార్జునతో సంతోషం, నేనున్నాను, బాస్, మనం వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది.