రఘురామకు చిత్రహింసలు.. సుప్రీంకు సంచలన నివేదిక

వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు చిత్రహింసలు పెట్టినట్టు తేలింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఈ నివేదిక తయారు చేశారు. ఇదిప్పుడు సంచలనంగా మారింది. ముగ్గురు వైద్యులు రూపొందించిన ఈ నివేదికలో సీఐడీ అధికారులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు తేల్చారు. ఈ వైద్యపరీక్షల నివేదికపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్, ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదిక అందినట్టు తెలిపారు. […]

Written By: NARESH, Updated On : May 22, 2021 10:12 am
Follow us on

వైసీపీ నర్సాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ పోలీసులు చిత్రహింసలు పెట్టినట్టు తేలింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించి మరీ ఈ నివేదిక తయారు చేశారు. ఇదిప్పుడు సంచలనంగా మారింది. ముగ్గురు వైద్యులు రూపొందించిన ఈ నివేదికలో సీఐడీ అధికారులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు తేల్చారు.

ఈ వైద్యపరీక్షల నివేదికపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్, ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదిక అందినట్టు తెలిపారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్ రే, వీడియో పంపారని అన్నారు.

రఘురామకు జనరల్ ఎడిమాతోపాటు గాయాలున్నట్టు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్ శరన్ వివరించారు. రఘురామ తరుఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. కస్టడీలో ఎంపీ రఘురామను చిత్రహింసలకు గురిచేసినట్టు తేలిందని ముకుల్ రోహిత్గీ తెలిపారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.

ఇక సిట్టింగ్ ఎంపీనే పోలీసులు ఇలా కొడితే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ముకుల్ రోహిత్గీ సుప్రీంకోర్టులో వాదించారు.

అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం తరుఫున వాదించిన దవే మాట్లాడారు.. ‘ఈ గాయాలు ఆయన స్వయంగా చేసుకున్నావా? కాదా అనేది తెలియాల్సి ఉందన్నారు. ఈ కేసును వాయిదా వేయాలన్న ప్రభుత్వం అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాదనలు వింటామని.. ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.

రఘురామకృష్ణంను ఏపీ పోలీసులు కొట్టారా లేదా తేల్చడానికి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసి నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎక్స్ రే, వీడియో రూపంలో నివేదికను తెలంగాణ హైకోర్టు ద్వారా గురువారం సుప్రీంకోర్టుకు చేరింది.

మొత్తం కేసులో రఘురామను కొట్టారన్నది వాస్తవం అని తేలింది. మరి దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి చర్య తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. రఘురామ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇరుకునపడ్డట్టు అయ్యింది.