https://oktelugu.com/

18 ఏళ్లు నిండాయా.. వ్యాక్సిన్ కోసం రిజిష్టర్ చేసుకోండిలా..?

దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. అధికారుల అంచనాలను మించి ప్రతిరోజు 3 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే నెల 1వ తేదీ నుంచి 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కోవిన్ లేదా ఆరోగ్య […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 28, 2021 / 12:45 PM IST
    Follow us on

    దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. అధికారుల అంచనాలను మించి ప్రతిరోజు 3 లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మే నెల 1వ తేదీ నుంచి 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కోవిన్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా కరోనా వ్యాక్సిన్ కోసం సులభంగా రిజీస్ట్రేషన్ చేసుకోవచ్చు.

    ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్లు మాత్రమే కరోనా వ్యాక్సిన్ ను తీసుకునే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల కంటే వయస్సు పైబడిన వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో కేంద్రం రిజిస్ట్రేషన్ ప్రక్రియను తప్పనిసరి చేసింది. ఎవరైతే వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్లు మొదట cowin.gov.in వెబ్ సైట్ లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తరువాత మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

    ఫోన్ నంబర్ ను ఎంటర్ చేసిన తరువాత మొబైల్ కు వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి ఐడీ ప్రూఫ్, ఇతర వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటే ఆ వివరాలను కూడా తప్పనిసరిగా నమోదు చేయాలి. షెడ్యూల్ అపాయింట్ మెంట్ అనే ఆప్షన్ ద్వారా అపాయింట్ మెంట్ ను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

    ఆరోగ్యసేతు యాప్ ద్వారా వ్యాక్సిన్ కోసం రిజిష్టర్ చేసుకోవాలని అనుకునే వారు యాప్ ఓపెన్ చేసిన తరువాత అందులో కోవిన్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి మొబైల్ నంబర్ తో పాటు వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి. ఆ తరువాత రిజిస్ట్రేషన్ పేజీలో వివరాలను నమోదు చేసి వ్యాక్సిన్ కొరకు రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.