https://oktelugu.com/

ఈ 5 కరోనా లక్షణాలు ఉన్నాయా.. డాక్టర్ ను సంప్రదించాల్సిందే..?

భారత్ లో కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్త కరోనా వేరియంట్లు ప్రమాదకరం అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల వల్ల వైరస్ లోడ్ సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. అయితే కొన్ని కరోనా లక్షణాలు మాత్రం అత్యంత ప్రమాదకరమైన లక్షణాలు అని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకితే హోమ్ క్వారంటైన్ లో ఉండి […]

Written By: , Updated On : April 21, 2021 / 01:42 PM IST
Follow us on

Corona New Symptoms

భారత్ లో కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్త కరోనా వేరియంట్లు ప్రమాదకరం అని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల వల్ల వైరస్ లోడ్ సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. అయితే కొన్ని కరోనా లక్షణాలు మాత్రం అత్యంత ప్రమాదకరమైన లక్షణాలు అని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకితే హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స చేయించుకుంటే మంచిది. శ్వాస తీసుకోలేకపోవడం, ఛాతిలో నొప్పి కరోనా లక్షణాల్లో తీవ్రమైన లక్షణాలు అని చెప్పవచ్చు. కరోనా వైరస్ ఆరోగ్యకరమైన శ్వాసకోశ నాళాలపై దాడి చేస్తే శ్వాస తీసుకోవడం కష్టంగా మారే అవకాశాలు ఉండటంతో పాటు ఆక్సిజన్ స్థాయిలు ఆకస్మాత్తుగా పడిపోయే అవకాశం ఉంటుంది.

కరోనా సోకిన వాళ్లు ఆక్సీమీటర్ సహాయంతో ఆక్సిజన్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మతిమరుపు లేదా కన్ఫూజన్ లక్షణాలు కనిపించినా కరోనా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా సోకిన వారిలో మెదడు, నాడీసంబంధిత వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఛాతిలో ఎలాంటి తేలికపాటి నొప్పి వచ్చినా నిర్లక్ష్యం చేయకూడదు.

పెదాలు, ముఖంలోని పలు భాగాలు నీలం రంగులోకి మారినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. జ్వరం, గొంతునొప్పి, ముక్కు కారడం, కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.