PM Modi Jammu Kashmir Visit: జమ్ము కశ్మీర్ పై ప్రధానమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రగతిపై పట్టు సాధిస్తున్నారు. జమ్ముకశ్మీర్ ను అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. గత పాలకుల వలె కాకుండా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. అందుకే రాష్ట్రాన్ని అన్ని దారుల్లో ముందుకు తీసుకెళ్లడానికే ప్రాదాన్యం ఇస్తున్నారు. ఏ నాయకుడు చేయలేని పని చేస్తూ అక్కడి ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. పలితంగా సమస్యల పరిష్కారంపై కూడా తనదైన ముద్ర వేస్తున్నారు ప్రజల సుఖసతోషాలే ఎజెండాగా పనులు చేస్తున్నారు. దీంతో ప్రజల్లో కూడా నిస్సహాయత నిస్ర్పహలు దూరమవుతున్నాయి.
370 ఆఱ్టికల్ రద్దు పెద్ద సాహసమే. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సాధ్యపడని జీవో 370 రద్దు వ్యవహారంలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా చూపిన తెగువ సాటిలేనిది. అక్కడి ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చి వారి సమస్యల నిర్మూలనకు నడుం కట్టడం నిజంగా ముదావహమే. దీంతో జమ్ముకశ్మీర్ ను రాష్ట్రంగా చేసి అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఇక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు చకచకా పనులు సాగుతున్నాయి.
ప్రధాని జమ్ముకశ్మీర్ పై వరాల జల్లు కురిపిస్తున్నారు. పెద్ద ప్రాజెక్టుల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తున్నారు. చీనాబ్ నదిపై అతిపెద్ద రైల్వే వంతెన నిర్మిస్తున్నారు. దీంతో ఆ రాష్ట్ర భవితవ్యమే మారనుంది. ఇంకా పలు ప్యాకేజీల ద్వారా జమ్మును అగ్రగామిగా నిలపాలనే తాపత్రమపడుతున్నారు. దీని కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు ప్రజలను కూడా సంసిద్ధులను చేస్తున్నారు. ప్రగతి పథంలోనిలిపేందుకు కంకణం కట్టుకున్నారు.
మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా నియమితులైన తరువాత షెహబూబ్ మొసలికన్నీరు కారుస్తున్నారు. జమ్ముపై దొంగ నాటకాలు ఆడుతున్నారు. కానీ ప్రధాని మోడీ తెగువతో ప్రస్తుతం చొరబాట్లు తగ్గాయి. ఉగ్రమూకల దురాగాతాలు లేకుండా పోయాయి. దీంతో జమ్ము ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. ప్రధాని మోడీ తీసుకుంటున్ననిర్ణయాల వల్లే జమ్ముకశ్మీర్ సుందరంగా ఉండగలుగుతోంది. భవిష్యత్ లో జమ్ముకశ్మీర్ ను మరింత ప్రగతి మార్గంలో నడిపించేందుకు అన్ని దారులు సిద్ధంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది.
దీంతో జమ్ముకశ్మీర్ అంశం ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందుతోంది. నరేంద్ర మోడీ ప్రతిభ గుర్తిస్తోంది. ప్రాంతాల మధ్య వైరుధ్యాల నిర్మూలనకు మోడీ తీసుకుంటున్న చర్యల పట్ల యావత్తు ప్రపంచమే కితాబిస్తోంది. సమర్థుడైన పాలన దక్షుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. దీంతోనే మోడీ చరిష్మా ఇంకా తగ్గలేదని తెలుస్తోంది. ఈనెల 24న ప్రధాని మోడీ కశ్మీర్ లో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడి ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రధాని పర్యటన సందర్భంగా ఇంకా ఏం హామీలు ఇస్తారోననే ఉత్కంఠ అందరిలో ఏర్పడింది.
Also Read:Srikakulam Politics: ఆ ఇద్దరు నేతలే లక్ష్యంగా.. సిక్కోలులో ధర్మాన ప్రసాదరావు రివేంజ్ రాజకీయం
Recommended Videos: