భారత్ లో కొత్త టెక్నాలజీ.. 30 సెకన్లలో కరోనా ఫలితం..!

  ప్రపంచ దేశాల్లో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ వైరస్ బారిన పడుతున్నారు. కరోనా మహమ్మారి వల్ల దగ్గు, జలుబు వచ్చినా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా పరీక్ష చేయించుకోవాలన్నా ఫలితం కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి ఉంటుంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వేగంగా ఫలితం తెలిస్తే మాత్రమే కరోనాను కట్టడి చేయగలుగుతాం. శాస్త్రవేత్తలు ఈ దిశగా చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. […]

Written By: Navya, Updated On : October 10, 2020 8:28 am
Follow us on

 

ప్రపంచ దేశాల్లో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ వైరస్ బారిన పడుతున్నారు. కరోనా మహమ్మారి వల్ల దగ్గు, జలుబు వచ్చినా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనా పరీక్ష చేయించుకోవాలన్నా ఫలితం కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి ఉంటుంది. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వేగంగా ఫలితం తెలిస్తే మాత్రమే కరోనాను కట్టడి చేయగలుగుతాం.

శాస్త్రవేత్తలు ఈ దిశగా చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు భారత్ తో కలిసి సరికొత్త కరోనా టెస్టును అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధానం అమలులోకి వస్తే మాత్రం కరోనా బాధితులకు వీలైనంత త్వరగా చికిత్స అందించడంతో పాటు వారి నుంచి వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా కరోనా వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

భారత్, ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల నూతన విధానం ద్వారా 30 సెకన్లలో కరోనా పరీక్ష చేసి ఫలితాన్ని కనిపెట్టడంతో పాటు ఈ విధానం ద్వారా ఓపెన్ ప్రదేశాల్లో కూడా పరీక్షలు చేయవచ్చు. ట్యూబ్ లో గాలి ఊదితే కరోనా సోకిందో లేదో సులువుగా తెలుస్తుంది. ఇజ్రాయెల్ రాయబారి రాన్ మాల్కా ఈ విధానం ద్వారా వేగంగా తక్కువ ఖర్చుతో పరీక్షలు నిర్వహించడం సాధ్యమవుతుందని వెల్లడించారు.

ర్యాపిడ్ టెస్టులతో పోల్చి చూస్తే ఈ విధానమే బెటర్ అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరో 20 రోజుల్లో ఈ పరీక్షలు చేసే కిట్లు అందుబాటులోకి రానున్నాయి. భారత్ ఈ టెస్ట్ కిట్ల తయారీకి మ్యానుఫాక్టరింగ్ హబ్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాస్త్రవేత్తల ప్రయోగాలు మంచి ఫలితాలు సాధిస్తుండటంతో అతి త్వరలో కరోనా కట్టడి సాధ్యమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.