40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు దేశానికి ప్రధానులను, రాష్ట్రపతులను మార్చిన ఘనత గల వ్యక్తి. ఈ 40 ఏళ్లలో ఆయన ఎన్నో వ్యవస్థలను మేనేజ్ చేసుంటాడని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. అందుకే 40 ఏళ్లుగా ఒక్క కేసులో కూడా చంద్రబాబు ఇరుక్కోలేదంటే ఆయన ఘనతను మనం అర్థం చేసుకోవచ్చు. కానీ సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు చరిత్ర పరిసమాప్తం కానుందనే ప్రచారం సాగుతోంది.
Also Read: జగన్ కు కలిసొచ్చిన కరోనా.. సిబిఐ కోర్టు కేసు నుంచి ఉపశమనం?
చంద్రబాబుపై అక్రమ ఆస్తుల కేసు కొన్ని సంవత్సరాల క్రితమే దాఖలైంది. కానీ ఈ కేసుకు సంబంధించి గత 15 సంవత్సరాలుగా రాష్ట్ర హైకోర్టు నుంచి చంద్రబాబు స్టే తెచ్చుకొని విచారణను తప్పించుకున్నారు. కానీ సుప్రీం కోర్టు తీర్పుతో ఆ కేసులన్నీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు వెళుతున్నాయి. దీంతో స్టేను అనుభవిస్తున్న టిడిపి అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం ఎన్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు విచారణను ఎదుర్కోవలసి వస్తోంది.
చంద్రబాబు అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తు ఇక వేగవంతం కానుంది. సుప్రీం కోర్టు ఆదేశానుసారం నేతలపై కేసుల కోసం ఇప్పటికే హైదరాబాద్‌లోని అవినీతి నిరోధక బ్యూరో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. నేతలపై నమోదైన కేసుల విషయంలో విచారణలను వేగవంతం చేయాలని దిగువ కోర్టులకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు విచారణను శుక్రవారం చేపట్టింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిఎంలు, మాజీ సిఎంలతో సహా అన్ని ప్రజా ప్రతినిధులపై కేసులు బోలెడు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటిని త్వరితగతిన ఈ ప్రత్యేక కోర్టు విచారించనుంది.
ప్రస్తుత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మి పార్వతి 2004లో ఎసిబి కోర్టులో చంద్రబాబుపై పిటిషన్ దాఖలు చేశారు.. 1987 నుంచి 2005 మధ్య చంద్రబాబు అక్రమ మార్గాల ద్వారా భారీగా ఆస్తులు సంపాదించాడని ఆమె పిటీషన్ లో ఆరోపించారు. అయితే చంద్రబాబు 2005లో హైకోర్టులో ఈ ఎసిబి కేసును సవాలు చేశాడు. దర్యాప్తుపై స్టే పొందాడు. ఈ స్టే ఇటీవలే ముగిసిపోయింది. దీంతో తిరిగి లక్ష్మీపార్వతి ఏసిబి కోర్టును ఆశ్రయించగా విచారణను తిరిగి ప్రారంభించింది.
పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు దిగువ కోర్టులను కోరడంతో చంద్రబాబు కేసును కూడా ఏసిబి కోర్టు శుక్రవారం విచారణకు తీసుకుంది.. తదుపరి విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది.
Also Read: మరో బాంబు పేల్చిన రఘురామా? ఆ మగ్గురు జైలుకేనట?
ఇక, తెలంగాణకు చెందిన అనేక మంది ఇతర ప్రజాప్రతినిధులు తమపై ఉన్న వివిధ పెండింగ్ కేసులకు సంబంధించి నాంపల్లిలోని క్రిమినల్ కోర్టులకు ఈరోజు హాజరయ్యారు. మంత్రి తలాసాని శ్రీనివాస యాదవ్, మాజీ మంత్రి టి పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తా గోపాల్, టి జయప్రకాష్ రెడ్డి, సీతక్కతో పాటు మాజీ ఎమ్మెల్యే జుపల్లి కృష్ణారావు తదితరులు కోర్టుకు హాజరైన వారిలో ఉన్నారు. ఈ కేసులను వచ్చే సోమవారానికి కోర్టు వాయిదా వేసింది.
చంద్రబాబు కేసు త్వరితగతిన విచారణకు రానుండడంతో టీడీపీలో గుబులు మొదలైంది. ఆయన అక్రమాస్తుల కేసు కనుక దోషిగా తేలితే ఇక చంద్రబాబుకు భవిష్యత్తే ఉండదని.. లోకేష్ తో ఏం పనికాదని నేతలు భావిస్తున్నారు.కేసు విచారణలో బాబు ఇరుక్కుంటే టీడీపీ పని ఖతమేనంటున్నారు. చంద్రబాబు చరిత్ర పరిసమాప్తం అవుతుందని అనుకుంటున్నారు.