Corona Effect: కరోనా ప్రభావంతో అన్ని వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. మరోవైపు విద్యావ్యవస్థపై కూడా తన కరోనా అధిక ప్రభావాన్ని చూపించింది. విద్యార్థుల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. విద్యార్థుల్లో వచ్చిన మార్పుకు కంగారు పడుతున్నారు. గతంలో ఇచ్చిన హోం వర్క్ ను తూచ తప్పకుండా చేసేవారు. కానీ కరోనా తరువాత విద్యార్థులు హోం వర్క్ చేయడం లేదు. ఏమని అడిగితే నా ఇష్టం అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇంకా తరగతి గదుల్లోనే గుట్కాలు తినడం అడిగితే గుర్రుగా చూడటం చూస్తుంటే ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
పిల్లల్లో కలుగుతున్న మానసిక పరివర్తనకు కరోనానే కారణమనే అభిప్రాయాలు వస్తున్నాయి. కరోనా కాలంలో పాఠశాలలు మూతపడటంతో పిల్లలు పెద్దవారితో పనికి వెళ్లడంతో వారి అలవాట్లను నిశితంగా పరిశీలించి వారిని అనుకరించే క్రమంలో నిర్లక్ష్యం ఆవహించినట్లు తెలుస్తోంది. దీంతో ఉపాధ్యాయులు విద్యార్థుల తీరుతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: సొయాపాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?
విద్యార్థులు కొత్త అలవాట్లు నేర్చుకున్నారు. తరగతి గదిలో గుట్కా తినడం చూస్తుంటే ఉపాధ్యాయులే కంగారు పడుతున్నారు. మూడు నెలల కాలంలో విద్యార్థుల ప్రవర్తనలో వచ్చిన మార్పులకు అయోమయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా విద్యార్థుల క్రమశిక్షణ గతి తప్పడం చూస్తుంటే అందరిలో ఆశ్చర్యం వస్తోంది. ఈ నేపథ్యంలో వారి భవిష్యత్ పై పెను ప్రభావం కనిపిస్తోంది.
విద్యార్థుల్లో నిర్లక్ష్య ధోరణి, మొండితనం పెరిగిపోవడం చూస్తుంటే వారిలో మార్పు తీసుకురావడం కష్టమే అనే అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మానసికంగా ఇంత కఠినంగా తయారవడం చూస్తుంటే వారు ఇక ఎవరి మాట వినేలా కనిపించడం లేదని తెలుస్తోంది. దీంతో విద్యార్థుల భవిష్యత్ కు భంగం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సృష్టించిన ఉత్పాతంలో వారి చదువులు మాత్ర అటకెక్కినట్లే కనిపిస్తోంది.
Also Read: పల్లీలు ఎక్కువగా తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్!