RRR: బాహుబలి సినిమా తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే వరుసగా పోస్టర్లు, పాటలు విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో తారక్, చెర్రీలు మునుపెన్నడూ కనిపించని విభన్న పాత్రల్లో నటిస్టుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఒక్కొక్కరికి రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది.
కాగా ప్రమోషన్స్‌లో వేగవంతం పెంచిన రాజమౌళి.. ముంబయి వేదికగా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. భారీ సెట్టింగ్స్‌తో ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ కార్య్రమంలో స్పెషల్ హంగులతో బాలీవుడ్ అభిమానులకు తగ్గట్లుగా కొన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ ఈవెంట్లో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, తార్లు కలిసి ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్ల సమాచారం. అది కూడా నాటు నాటు పాటకు డాన్స్ వేసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. ఒక వేళ అదే నిజమైతే.. బాలీవుడ్లో ప్రమోషన్స్ పరంగా ఇదొక్క ఈవెంట్ చాలని అంటున్నారు విశ్లేషకులు.