https://oktelugu.com/

Kitchen Tip: తరచూ స్టవ్‌పై పాలు పొంగి పోతున్నాయా.. ఈ సింపుల్ చిట్కా పాటించాల్సిందే!

Kitchen Tip: సాధారణంగా ప్రతి రోజూ మనం ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం కోసం పాలు స్టవ్ మీద వేడి చేస్తాము. అయితే కొన్ని పనుల కారణంగా లేదా స్టవ్ మీద పాలు పెట్టామనే విషయాన్ని మర్చిపోవడంతో పాలు పొంగిపోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే పాలన్ని అలా వృధా అయితే చాలా బాధగా కూడా ఉంటుంది.అయితే ఈ విధంగా పాలు వృధా కాకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కాను పాటిస్తే ఎప్పటికీ స్టవ్ మీద […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2021 / 11:48 AM IST
    Follow us on

    Kitchen Tip: సాధారణంగా ప్రతి రోజూ మనం ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం కోసం పాలు స్టవ్ మీద వేడి చేస్తాము. అయితే కొన్ని పనుల కారణంగా లేదా స్టవ్ మీద పాలు పెట్టామనే విషయాన్ని మర్చిపోవడంతో పాలు పొంగిపోతూ ఉంటాయి.

    Kitchen Tip

    ఈ క్రమంలోనే పాలన్ని అలా వృధా అయితే చాలా బాధగా కూడా ఉంటుంది.అయితే ఈ విధంగా పాలు వృధా కాకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కాను పాటిస్తే ఎప్పటికీ స్టవ్ మీద పాలు పొంగిపోయి వృధా కాకుండా ఉంటాయి. మరి ఆ చిట్కా ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

    Kitchen Tip

    Also Read: పొరపాటున డబ్బులు వేరే అకౌంట్ కి పంపించారా.. వెంటనే ఇలా చేయండి?

    మనం పాలు కాచేటప్పుడు పాలలో ఒక చెక్క స్పూన్ గిన్నెలోపల నిటారుగా పెట్టడం వల్ల పాలు ఎప్పటికీ పొంగిపోవు. మనం కింద ఎంతమంట పెట్టినప్పటికీ గిన్నె లోపల ఒక చెక్క స్పూన్ ఉంటే ఆ పాలు పొంగిపోయి వృధా కాకుండా ఉంటాయి. అయితే చెక్క స్పూన్ కి పాలు పొంగిపోకుండా ఉండటానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

    మనం పాలను బాగా కాంచుతున్న సమయంలో కింద మంట పెట్టడం వల్ల ఒక పొర మాదిరి ఆవిరిగా పైకి వస్తూ ఉంటాయి. ఇలా ఆ విరూపంలో పైకి వస్తున్న సమయంలో ఆ చెక్క స్పూన్ కి తాకగానే అవి పగిలిపోతాయి. అలాగే చెక్క తొందరగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది. అందుకే పాలు తొందరగా కూడా పొంగు రావు. అందుకే పాలు అక్కడి వరకు వచ్చి ఆగిపోతాయి కానీ ఎప్పుడు పొంగిపోయి వృథా కావు. కనుక ఇకపై ఎప్పుడూ పాలు పొంగిపోయి వృధా కాకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా ఫాలో అయితే పాలు వృధా కాకుండా ఉంటాయి.

    Also Read: సంతోషకరమైన జీవితం గడపాలా.. అయితే ఈ వాస్తు టిప్స్ పాటించాల్సిందే..?

    ఇవి కూడా చదవండి
    1. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజుకు మెగా, సూపర్ స్టార్స్ స్పెషల్ విషెష్​
    2. పవన్ కల్యాణ్ ‘పవర్’ చూపించాల్సిన టైం వచ్చిందా?
    3. ఎంతమంది బ్యూటీలున్నా.. ఈ మిల్కీ బ్యూటీ చాలా స్పెషల్​
    4. ‘పుష్ప’ లేటెస్ట్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ అయింది !