https://oktelugu.com/

వాటి వ‌ల్లే క‌రోనా వ్యాప్తి.. వాస్తవాలు వెల్లడించిన చైనా శాస్త్రవేత్తలు..?

ప్రపంచ దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, తీసుకునే జాగ్రత్తలు పూర్తిగా మారిపోయాయి. చైనా దేశం నుంచి మన దేశంతో పాటు ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చైనాలోని వుహాన్ లో ఉన్న ఒక ల్యాబ్ లోనే మొదట కరోనా వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారని వార్తలు వచ్చాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 17, 2021 / 06:22 PM IST
    Follow us on


    ప్రపంచ దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు, తీసుకునే జాగ్రత్తలు పూర్తిగా మారిపోయాయి. చైనా దేశం నుంచి మన దేశంతో పాటు ఇతర దేశాలకు వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి ఉధృతి తగ్గినా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చైనాలోని వుహాన్ లో ఉన్న ఒక ల్యాబ్ లోనే మొదట కరోనా వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారని వార్తలు వచ్చాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాలు ఇవే ఆరోపణలు చేశాయి.

    అయితే చివరకు ఆ ఆరోపణలు నిజమని తేలుతోంది. చైనాలో వైరస్ వ్యాప్తి చెందినా డ్రాగన్ దేశం మాత్రం ఆ ఆరోపణలను అంగీకరించలేదు. కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్ పుట్టుక గురించి అధ్యయనం చేయడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం చైనాకు వెళ్లిన సంగతి తెలిసిందే. వుహాన్ ల్యాబ్ కు చెందిన శాస్త్రవేత్తలు క‌రోనా వైర‌స్ సోకిన గ‌బ్బిలాలు కుట్టాయ‌ని తైవాన్ టైమ్స్ లో కథనం ప్రచురితమైంది.

    ఒక గుహలోకి 2017 సంవత్సరంలో వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని శాస్త్రవేత్తలు చెప్పారని సమాచారం. తైవాన్ టైమ్స్ లో ఈ విషయాలు ప్రచురితం కావడంతో ఇప్పటివరకు చైనా చెప్పిన మాటలన్నీ నిజం కాదని తేలింది. డ‌బ్ల్యూహెచ్‌వోకు చెందిన 13 మంది బృందం చైనాలో ప్రస్తుతం కరోనా వైరస్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

    ఒక శాస్త్రవేత్త గబ్బిలం తన చేతిలోని గ్లోవ్స్ లోకి వెళ్లి మరీ కుట్టిందని వెల్లడించారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు విరుద్ధంగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు వైరస్ లను పరీక్షించారని ఆ సమయంలోనే వాళ్లు కరోనా బారిన పడి ఉండవచ్చని తెలుస్తోంది.