ఆలయ దాడులను టీడీపీ చేసిందని ఆ మీడియా బాస్ కన్ఫమ్ చేశాడా?

టీడీపీ అధినేత చంద్రబాబు అనుంగ మిత్రుడు, ప్రధాన మీడియా అధినేత ఈరోజు తన కాలమ్ ఒక షాకింగ్ కథనాన్ని రాసుకొచ్చాడు. ఏపీలో గెరిల్లా యుద్ధ శైలిలో ఆలయాలపై దాడులు జరుగుతాయని ఆయన ముందే ఊహించి చెప్పుకొచ్చారు. దీనివెనుక ఎవరున్నారో తెలుసు అంటూ తనకు తెలిసిన రహస్యాన్ని దాచేశాడు. దీన్ని ఆయనకు ఈ కుట్రకోణం ముందే తెలుసని..ఆయనను గట్టిగా విచారిస్తే ఏపీలోని ఆలయాలపై దాడుల వెనుక రహస్యం తెలుస్తుందని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. Also Read: వ్యాక్సిన్ కల్లోలం.. […]

Written By: NARESH, Updated On : January 17, 2021 6:52 pm
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబు అనుంగ మిత్రుడు, ప్రధాన మీడియా అధినేత ఈరోజు తన కాలమ్ ఒక షాకింగ్ కథనాన్ని రాసుకొచ్చాడు. ఏపీలో గెరిల్లా యుద్ధ శైలిలో ఆలయాలపై దాడులు జరుగుతాయని ఆయన ముందే ఊహించి చెప్పుకొచ్చారు. దీనివెనుక ఎవరున్నారో తెలుసు అంటూ తనకు తెలిసిన రహస్యాన్ని దాచేశాడు. దీన్ని ఆయనకు ఈ కుట్రకోణం ముందే తెలుసని..ఆయనను గట్టిగా విచారిస్తే ఏపీలోని ఆలయాలపై దాడుల వెనుక రహస్యం తెలుస్తుందని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

Also Read: వ్యాక్సిన్ కల్లోలం.. సైడ్ ఎఫెక్ట్ లతో టెన్షన్

కొన్ని వారాల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఆలయ దాడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ముఖాముఖిగా పోరాడలేక టిడిపి ఈ దాడులు చేస్తోందని ఆరోపించారు . ‘గెరిల్లా దాడులు’ అనే పదాన్ని ‘ఆలయ దాడుల’ సందర్భంలో మాత్రమే ఆయన ప్రస్తావించారు.ఈ రోజు ఆ టీడీపీ అనుకూల మీడియా అధినేత ఇలానే రాసుకొచ్చేయడం విశేషం.

గతంలోనే ఏపీ సీఎం జగన్ ఏపీలో ఆలయాలపై దాడుల వెనుక కుట్రకోణాన్ని బయటపెట్టారు. “కొందరు ప్రభుత్వంపై గెరిల్లా దాడులు చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్న బలమైన ప్రభుత్వంపై దాడి చేయడానికి వేరే దారిలేక ఇలా గుడులు, గోపురాలను బేస్ చేసుకొని పోరాడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు నేరుగా ఎదుర్కొనలేక ఇలా కుట్ర పన్నుతున్నాయని జగన్ ఆరోపించారు. “.

Also Read: రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఆ రైళ్లు లేనట్లే..?

‘ఆలయ దాడులకు’ తమకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించడానికి టిడిపి తన ప్రయత్నాలు చేస్తోండగా.. ఆ టీడీపీ అనుకూల మీడియా అధినేత మాత్రం తన వ్యాసంలో ఈ ధర్మ సందేహాలను వెల్లడించడంతో ఈ కుట్ర గురించి ఆయనకు ముందే తెలుసా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఇందిరా గాంధీ, జయలలిత, కరుణానిధి వంటి శక్తివంతమైన నాయకులు కూడా ఈ పరిస్థితిని చూశారు. కానీ వారు ఎప్పుడూ కుట్రలతో గెరిల్లా దాడుల్లోకి దిగలేదు.. ప్రజల మద్దతు పొందుతూ వారు బహిరంగంగా పోరాడారు. కానీ ఏపీలోని ప్రతిపక్షాలు మాత్రం దేవుడితో రాజకీయం చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదంతా టీడీపీకి, వారి అనుకూల మీడియా అధినేతకు ముందే తెలుసు అని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్