https://oktelugu.com/

కేంద్రం కీలక నిర్ణయం.. వచ్చే నెల 1 నుంచి వాళ్లకు కరోనా వ్యాక్సిన్..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధ పడుతున్న 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుంది. కేంద్రం ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలోని 10,000 ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు 20 వేల ప్రైవేట్ ఆస్పత్రులలో వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది. Also Read: ఆ రాష్ట్రంలో విజృంభిస్తున్న […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 24, 2021 / 07:12 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధ పడుతున్న 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయనుంది. కేంద్రం ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలోని 10,000 ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు 20 వేల ప్రైవేట్ ఆస్పత్రులలో వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది.

    Also Read: ఆ రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా.. అపార్ట్‌మెంటుకు సీల్..?

    ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ ఫ్రీగానే లభించనుండగా ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో మాత్రం డబ్బులు చెల్లించి కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ కు ఎంత చెల్లించాలనే విషయం తెలియాల్సి ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అతి త్వరలో ఈ నిర్ణయం తీసుకోనుంది. మాన్యుఫ్యాక్చరర్లు, ఆసుపత్రులతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు చర్చలు జరుపుతోందని తెలుస్తోంది.

    Also Read: స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు అలర్ట్.. కరోనాతో పొంచి ఉన్న ప్రమాదం..?

    ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 1,21,65,598 మందికి వ్యాక్సినేషన్ చేసినట్లు తెలుస్తోంది. దేశంలోని 64,98,300 మంది హెల్త్ కేర్ వర్కర్లకు తొలి డోసు, 13,98,400 మంది హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, 42,68,898 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి డోసు ఇచ్చినట్టు సమాచారం. ఇతర దేశాలతో పోల్చి చూస్తే ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ భారత్ లో జరుగుతోంది.

    మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్

    జనవరి 16వ తేదీన కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 13వ తేదీ నుంచి రెండో డోస్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 2వ తేదీ నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ కు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.