https://oktelugu.com/

విద్యార్థులకు గుడ్ న్యూస్: సీఎం జగన్ మరో సాహసోపేత నిర్ణయం..

ఏపీ సీఎంగా గద్దెనెక్కినప్పటి నుంచి సంచలన నిర్ణయాలకు మారుపేరుగా మారిన జగన్ అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు చేరువ అవుతున్నారు. అన్ని వర్గాలకు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకొని ఏపీ ప్రజలను.. ముఖ్యంగా విద్యార్థులను సంతోషంలో ముంచారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో కేంద్ర ప్రభుత్వ ‘సీబీఎస్ఈ’ సిలబస్ ను ప్రవేశపెట్టాలని సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1-7 తరగతులకు సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని […]

Written By:
  • NARESH
  • , Updated On : February 24, 2021 / 07:13 PM IST
    Follow us on

    ఏపీ సీఎంగా గద్దెనెక్కినప్పటి నుంచి సంచలన నిర్ణయాలకు మారుపేరుగా మారిన జగన్ అభివృద్ధి, సంక్షేమంతో ప్రజలకు చేరువ అవుతున్నారు. అన్ని వర్గాలకు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకొని ఏపీ ప్రజలను.. ముఖ్యంగా విద్యార్థులను సంతోషంలో ముంచారు.

    2021-22 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో కేంద్ర ప్రభుత్వ ‘సీబీఎస్ఈ’ సిలబస్ ను ప్రవేశపెట్టాలని సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1-7 తరగతులకు సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

    తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మనబడి, నాడు-నేడు పనులు, విద్యాకానుకపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఉన్నతాధికారులతో జగన్ సమీక్షించారు.

    సీఎం మాట్లాడుతూ ‘ఏడాదికి ఒక తరగతి చొప్పున 2024నాటికి పదోతరగతి వరకు సీబీఎస్ఈ విధానం అమల్లోకి తేవాలని.. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. పాఠ్యపుస్తకాలు కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అత్యంత నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. అమ్మఒడిలో విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ ల నాణ్యత, సర్వీసు బాగుండలన్నారు.

    విద్యావ్యవస్థను ముఖ్యంగా విద్యార్థులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో జగన్ కృషి, పట్టుదల అమోఘమని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలను ఎవరూ తీసుకొని ఉండరని ప్రశంసిస్తున్నారు.