అక్కడ ప్లేటు బిర్యానీ ఖరీదు రూ.20 వేలు.. ఎందుకంత ఖరీదంటే..?

మనలో చాలామంది బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. ప్లేట్ బిర్యానీ ఖరీదు రెస్టారెంట్ ను బట్టి 100 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉంటుంది. అయితే అక్కడ మాత్రం ప్లేట్ బిర్యానీ ఖరీదు ఏకంగా 20 వేల రూపాయలు కావడం గమనార్హం. దుబాయ్‌లోని ఓ బ్రిటిష్ కాలం నాటి బంగ్లాలో బాంబే బరో పేరుతో ఒక లగ్జరీ హోటల్ ప్రారంభమైంది. ఈ హోటల్ లో విక్రయించే బిర్యానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బిర్యానీ […]

Written By: Navya, Updated On : February 24, 2021 7:08 pm
Follow us on

మనలో చాలామంది బిర్యానీని ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. ప్లేట్ బిర్యానీ ఖరీదు రెస్టారెంట్ ను బట్టి 100 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉంటుంది. అయితే అక్కడ మాత్రం ప్లేట్ బిర్యానీ ఖరీదు ఏకంగా 20 వేల రూపాయలు కావడం గమనార్హం. దుబాయ్‌లోని ఓ బ్రిటిష్ కాలం నాటి బంగ్లాలో బాంబే బరో పేరుతో ఒక లగ్జరీ హోటల్ ప్రారంభమైంది.

ఈ హోటల్ లో విక్రయించే బిర్యానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బిర్యానీ కావడం గమనార్హం. దుబాయ్ కరెన్సీ ప్రకారం ఈ హోటల్ లో బిర్యానీ ఖరీదు 1,000 దిర్హమ్‌లు. ఇంత ఖరీదు చేసే ఈ బిర్యానీని రాయల్ గోల్డ్ బిర్యానీ పేరుతో విక్రయిస్తున్నారు. హోటల్ తొలి వార్షికోత్సవం సందర్భంగా మెనూలో చేరిన ఈ బిర్యానీ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఆర్డర్ చేసిన వారికి గోల్డ్ మెటాలిక్ ప్లేట్‌లో బిర్యానీని సర్వ్ చేస్తారు. ఈ బిర్యానీలో చికెన్ బిర్యానీ రైస్, కీమా రైస్, వైట్/శాఫ్రాన్ రైస్‌ వేరియంట్లు లభిస్తాయి.

బిర్యానీ పైన కశ్మీరీ ల్యాంబ్ సీక్ కెబాబ్స్, రాజ్‌పుట్ చికెన్ కెబాబ్స్, పాత ఢిల్లీ ల్యాంబ్ చాప్స్, ముఘలాయ్ కోఫ్తాలు, చికెన్ లాంటి వాటిని బిర్యానీపై అలంకరించి అందివ్వడం జరుగుతుంది. 23 కేరెట్ల బంగారం రేకులతో ఆ బిర్యానీ ప్లేటు మొత్తాన్ని అంగీకరిస్తారు కాబట్టి బిర్యానీ ధర ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంటుంది. రాయల్ లుక్‌తో నోరూరించే ఈ బిర్యానీని తినడానికి చాలామంది ఇష్టపడుతున్నారు.

ఈ బిర్యానీని కొనుగోలు చేసిన వారికి హారీ సాలన్, జోధ్‌పురి సాలన్, బాదామి సాస్‌లను బాదం, దానిమ్మ రైతాతో సైడ్ డిష్ లను కూడా అందిస్తారు. ఈ బిర్యానీని సర్వ్ చేయడానికే 45 నిమిషాల సమయం పడుతుందని ఆరు మంది ఈ బిర్యానీని తినవచ్చని తెలుస్తోంది