https://oktelugu.com/

నీళ్లు అనుకుని శానిటైజర్ తాగిన కమిషనర్.. చివరకు..?

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో శానిటైజర్ల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. చేతికి అంటుకున్న కరోనా వైరస్ ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో దేశంలోని చాలామంది శానిటైజర్లను వినియోగించి చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. ప్రయాణ సమయాల్లో హ్యాండ్ శానిటైజర్ ను వినియోగిస్తున్నారు. అయితే శానిటైజర్ బాటిళ్లు నీళ్ల బాటిళ్లను పోలి ఉండటంతో కొంతమంది శానిటైజర్ ను తాగి ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. Also Read: కేజీ ప్లాస్టిక్ ఇస్తే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 3, 2021 / 06:37 PM IST
    Follow us on

    కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో శానిటైజర్ల వినియోగం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. చేతికి అంటుకున్న కరోనా వైరస్ ముక్కు, నోరు ద్వారా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో దేశంలోని చాలామంది శానిటైజర్లను వినియోగించి చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. ప్రయాణ సమయాల్లో హ్యాండ్ శానిటైజర్ ను వినియోగిస్తున్నారు. అయితే శానిటైజర్ బాటిళ్లు నీళ్ల బాటిళ్లను పోలి ఉండటంతో కొంతమంది శానిటైజర్ ను తాగి ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

    Also Read: కేజీ ప్లాస్టిక్ ఇస్తే నచ్చింది తినే ఛాన్స్.. ఎక్కడంటే..?

    తాజాగా మహారాష్ట్రలోని ముంబై మునిసిపల్ కార్పోరేషన్ బీఎంసీ జాయింట్ కమిషనర్ రమేష్ పవార్ వాటర్ బాటిల్ అనుకుని శానిటైజర్ తాగారు. నేడు బడ్జెట్ సమావేశం జరగగా బడ్జెట్ సమావేశానికి కొన్ని నిమిషాల ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మొదట వాటర్ బాటిల్ అనుకుని రమేష్ పవార్ కొద్దిగా శానిటైజర్ ను తాగారు. ఆ తరువాత తాను తాగింది శానిటైజర్ అని రమేష్ పవార్ గుర్తించారు.

    Also Read: ప్రైవేట్‌ మార్కెట్‌లోకి కరోనా వ్యాక్సిన్.. ఎప్పటినుంచంటే..?

    ఆ తరువాత ఆయన పక్కకు వెళ్లి నోటిని శుభ్రం చేసుకున్నారు. నీటితో నోరు కడుక్కున్న తరువాత నోటిని శుభ్రం చేసుకున్న అధికారి నవ్వగా తోటి అధికారులు కూడా నవ్వారు. బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శానిటైజర్ తాగడం గురించి మాట్లాడిన రమేష్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    మరిన్ని వార్తలు కోసం: జనరల్

    బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టే సమయంలో తాను నీళ్లు తాగాలని అనుకున్నానని కానీ శానిటైజర్ బాటిల్, వాటర్ బాటిల్ ఒకేలా ఉండటంతో శానిటైజర్ ను తాగానని ఆయన తెలిపారు. పొరపాటును వెంటనే గ్రహించి నోటిని శుభ్రం చేసుకున్నానని తెలిపారు.