https://oktelugu.com/

‘శాకుంతలం’లో మెరవబోతున్న ఈషా రెబ్బా !

తెలుగు సినీ చరిత్రలో తెలుగందాలు రాణించకపోవటానికి కారణాలు చాలానే ఉన్నాయి. దీనిపై దర్శక నిర్మాతల నుండి ఒకరకంగా సమాధానం వస్తే, అవకాశాలకోసం ఎదురు చూస్తున్న నటీమణుల నుండి వేరొక విధంగా వినిపిస్తాయి. అయితే ఇప్పుడిప్పుడే ఈషా రెబ్బా, చాందినీ చౌదరీ, శోభిత ధూళిపాళ, నందినీ రాయ్, ప్రియాంక జవాల్కర్ లాంటి ముద్దుగుమ్మలు సత్తా చాటుతున్నారు. ఈ కోవలో ప్రథమ స్థానంలో అందం, అభినయంతో ఈషా రెబ్బా కొనసాగుతుంది. అమ్మడు సెలెక్టివ్ గా తనకొస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ […]

Written By:
  • admin
  • , Updated On : February 3, 2021 / 06:23 PM IST
    Follow us on


    తెలుగు సినీ చరిత్రలో తెలుగందాలు రాణించకపోవటానికి కారణాలు చాలానే ఉన్నాయి. దీనిపై దర్శక నిర్మాతల నుండి ఒకరకంగా సమాధానం వస్తే, అవకాశాలకోసం ఎదురు చూస్తున్న నటీమణుల నుండి వేరొక విధంగా వినిపిస్తాయి. అయితే ఇప్పుడిప్పుడే ఈషా రెబ్బా, చాందినీ చౌదరీ, శోభిత ధూళిపాళ, నందినీ రాయ్, ప్రియాంక జవాల్కర్ లాంటి ముద్దుగుమ్మలు సత్తా చాటుతున్నారు. ఈ కోవలో
    ప్రథమ స్థానంలో అందం, అభినయంతో ఈషా రెబ్బా కొనసాగుతుంది. అమ్మడు సెలెక్టివ్ గా తనకొస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ని కొనసాగిస్తోంది.

    Also Read: డిజిటల్ & శాటిలైట్ రైట్స్ లో మహేష్ సరికొత్త రికార్డ్ !

    ప్రస్తుతం ప్రముఖ దర్శకులు తరుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి రూపొందించిన `పిట్ట కథలు` వెబ్ సిరీస్ లో డిఫరెంట్ పాత్రలో నటిస్తుంది ఈషా రెబ్బా. ఈ ఆంథాలజీ సిరీస్ ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీలో కూడా నటిస్తుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సూపర్ ఛాన్స్ అందుకున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

    Also Read: మరో క్రేజీ మల్టీస్టారర్ కి రంగం సిద్ధం !

    మహాభారతంలోని ఆదిపర్వంలోగల దుష్యంతుడు, శాకుంతలం ప్రేమ కథ నేపథ్యంలో డైరెక్టర్ గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమాను చేయనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసింది. ఇందులో శకుంతల పాత్రలో ‘సమంత’ నటించనున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మూవీలో మరో కీలక పాత్ర కోసం గుణశేఖర్ ఈషా రెబ్బాని ఎంచుకున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే తెలుగమ్మాయి లక్కీ అనే చెప్పుకోవచ్చు. దుశ్యంతుడి పాత్రకి ఇంకా ఎవరనేది ఫైనల్ కాలేదట. ప్రీ ప్రొడక్షన్ పనులని ఛక ఛకా చేసేసి త్వరలో షూట్ స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్