https://oktelugu.com/

రవితేజ ఈ సారి గ్లామర్ ను నమ్ముకున్నాడు !

మాస్ మహారాజ్ రవితేజ వరుస పరాజయాలతో సతమతమవుతూ ‘క్రాక్’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. కాగా ప్రస్తుతం ‘ఖిలాడి’ అనే పేరుతో దర్శకుడు రమేష్ వర్మ తీస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. కాగా, ఈ సినిమాలో రవితేజది డబుల్ రోల్ అని.. అందుకే ఇద్దరు హీరోయిన్లని తీసుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరి హీరోయిన్స్ లో ఒకరు మీనాక్షి చౌదరి అనే కొత్త భామ, అలాగే మరో హీరోయిన్ గా ‘గద్దలకొండ […]

Written By:
  • admin
  • , Updated On : February 3, 2021 / 06:43 PM IST
    Follow us on


    మాస్ మహారాజ్ రవితేజ వరుస పరాజయాలతో సతమతమవుతూ ‘క్రాక్’ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. కాగా ప్రస్తుతం ‘ఖిలాడి’ అనే పేరుతో దర్శకుడు రమేష్ వర్మ తీస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. కాగా, ఈ సినిమాలో రవితేజది డబుల్ రోల్ అని.. అందుకే ఇద్దరు హీరోయిన్లని తీసుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరి హీరోయిన్స్ లో ఒకరు మీనాక్షి చౌదరి అనే కొత్త భామ, అలాగే మరో హీరోయిన్ గా ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో ఒక పాటలో డాన్స్ చేసిన డింపుల్ హయతిను తీసుకున్నారు.

    Also Read: మోస్ట్ హాట్ జోడీ నుండి బోల్డ్ సినిమా !

    అయితే డింపుల్ హయతి ఈ సినిమాలో ఫుల్ గా ఎక్స్ పోజింగ్ కి రెడీ అయిందట. మరి చూడాలి, ఈ భామ ఏ రేంజ్ గ్లామర్ ను చూపిస్తోందో. మొత్తానికి రవితేజ నెక్స్ట్ సినిమాలో ఫుల్లుగా గ్లామర్ ని నింపే ప్రయత్నంలో దర్శకుడు రమేష్ వర్మ ముమ్మర ప్రయత్నాలు చేసున్నాడట. ఎంతైనా క్రాక్ తో బిగ్గెస్ట్ హిట్ ను కొట్టాడు కాబట్టి ఖిలాడీకి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన క్రాక్ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుని ఇంకా తన వసూళ్ల ప్రవాహం అలాగే కొనసాగిస్తోంది.

    Also Read: ‘శాకుంతలం’లో మెరవబోతున్న ఈషా రెబ్బా !

    దీంతో రవితేజకు బాక్సాఫీస్ వద్ద ఇంకా స్టామినా ఉందని నిరూపించినట్టు అయింది. అందుకే, ఖిలాడి కోసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. లేటెస్ట్ గా అనసూయ కూడా జాయిన్ అయింది ఈ సినిమాలో. అనసూయ ఒక కీలక పాత్ర పోషిస్తుందని.. విలన్ ప్రియురాలిగా ఆమె కనిపిస్తోందని.. బాగా సెక్సీగా ఆమె నటించబోతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమాలో ముగ్గురు గ్లామర్ భామలు నటిస్తున్నారు. సినిమా నిండా గ్లామరే. అలాగే ఒక ఐటెం సాంగ్ కూడా ఉంటుందిట. ఆ పాటకి ఎవరిని తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా ఈ సారి రవితేజ గ్లామర్ ను నమ్ముకున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్