కేంద్ర మంత్రి పదవి వీరిద్దరికి ఖాయమేనా?

కేంద్రంలో బీజేపీ సర్కార్ రెండోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోని వచ్చిన సంగతి తెల్సిదే. మోడీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి సుమారు 15నెలలు కావస్తోంది. అయితే ఇప్పటివరకు విస్తరణకు నోచుకోలేదు. తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి మంత్రులే ఇప్పటివరకు కొనసాగుతున్నారు తప్ప కొత్తగా ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే మారుతున్న రాజకీయ సమీకణాల దృష్ట్యా మోదీ మరోసారి తన మంత్రవర్గాన్ని విస్తరించేందుకు రెడీ అవుతున్నారు. Also Read: హైకోర్టు సాక్షిగా అమరావతి రైతులకి జగన్ బంపర్ ఆఫర్…? […]

Written By: Neelambaram, Updated On : August 15, 2020 1:31 pm
Follow us on


కేంద్రంలో బీజేపీ సర్కార్ రెండోసారి బంపర్ మెజార్టీతో అధికారంలోని వచ్చిన సంగతి తెల్సిదే. మోడీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి సుమారు 15నెలలు కావస్తోంది. అయితే ఇప్పటివరకు విస్తరణకు నోచుకోలేదు. తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పటి మంత్రులే ఇప్పటివరకు కొనసాగుతున్నారు తప్ప కొత్తగా ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే మారుతున్న రాజకీయ సమీకణాల దృష్ట్యా మోదీ మరోసారి తన మంత్రవర్గాన్ని విస్తరించేందుకు రెడీ అవుతున్నారు.

Also Read: హైకోర్టు సాక్షిగా అమరావతి రైతులకి జగన్ బంపర్ ఆఫర్…?

గతంలో కంటే కూడా రాజ్యసభలో బీజేపీకి బలం పెరిగింది. దీంతో లోక్ సభలోనూ.. రాజ్యసభలోనూ బీజేపీకి తిరుగులేకుండా పోతుంది. ఈనేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు.. గతంలో నేతలకు ఇచ్చిన హామీలను నెరవెర్చేందుకుగాను కొత్తగా క్యాబినేట్ విస్తరణ చేయాల్సిన అవసరం కన్పిస్తోంది. అయితే ఆశావహుల లిస్టు చాలా పెద్దగానే ఉండటంతో ఎవరికీ క్యాబినెట్లోకి తీసుకోవాలనే దానిపై ఇప్పటికే మోదీ-షాలు చర్చించినట్లు సమాచారం. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమందికి కేంద్ర మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది.

మోదీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఛాన్స్ దక్కలేదనే చెప్పాలి. ప్రస్తుతం కేంద్ర హోం సహాయ మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి మాత్రమే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాధాన్యం వహిస్తుండటం గమనార్హం. మోదీ క్యాబినెట్ విస్తరిస్తే తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఏపీలో బీజేపీకి లోక్ సభ సభ్యులు.. రాజ్యసభ సభ్యులు లేరు. జగన్ ను పొత్తు పెట్టుకొని కేంద్రమంత్రి పదవీ ఇస్తారనుకుంటే అలాంటి వాతావరణం కన్పించడం లేదు. టీడీపీ ఫిరాయింపు నేతలు బీజేపీకి మద్దతు ఇస్తున్నా చంద్రబాబును బీజేపీ దూరం పెడుతుండటంతో వారికి కూడా ఛాన్స్ దక్కే అవకాశం లేదని తెలుస్తోంది.

మోదీకి అత్యంత సన్నిహితుడిగా ఉంటున్న వారణాసి రాంమాధవ్ కు ఏపీ నుంచి బెర్త్ దక్కుతుందని ప్రచారం జరుగుతుంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మోదీ-షాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దశాబ్దాలుగా బీజేపీలో పని చేస్తుండటంతో ఆయనకు మంత్రి పదవీ ఖాయమనే మాటలు విన్పిస్తున్నాయి. రాంమాధవ్ కు ఛాన్స్ రాకుంటే ప్రకాశం జిల్లాకు చెందిన జీవీఎల్ నరసింహారావుకు చోటు దక్కుతందనే టాక్ విన్పిస్తుంది.

Also Read: కాంగ్రెస్ ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుందేంటి..? దెబ్బకి కేసీఆర్ వణికిపోయాడు

తెలంగాణా నుంచి రేసులో మురళీధరరావు ఉన్నారు. ఈయన కూడా రాంమాధవ్ లాగే పార్టీ కోసం కష్టపడే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణలో బీసీ సామాజిక వర్గాన్ని ఆకర్షించేలా మురళీధరరావుకు పదవీ ఇస్తారనే టాక్ విన్పిస్తోంది. ఆయనకు ఛాన్స్ రాకపోతే బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు దక్కతుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ఎక్కువ ఛాన్స్ ఉండటంతో తెలంగాణకు ప్రాధాన్యం దక్కడం ఖాయంగా కన్పిస్తోంది. త్వరలోనే దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది.

మోడీ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పదిహేను నెలలు కావస్తోంది. విస్తరణ అంటూ లేదు, ప్రమాణం చేసినపుడు ఉన్న వారే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఈ మధ్యలో ఎన్నో రాజకీయ పరిణామాలు జరిగాయి. రాజ్యసభలో బలం పెరిగింది. కొందరికి ఆశ పెట్టారు, మరికొందరికి కచ్చితంగా పదవులు ఇవ్వాలి. ఇంకొన్ని చోట్ల పార్టీని బలోపేతం చేసుకోవడానికి మంత్రులను తీసుకోవాలి. ఈ మొత్తం కసరత్తు మీద మోడీ, అమిత్ షా త్వరలోనే దృష్టి పెడతారని అంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఈసారి మరిన్ని పదవులు వస్తాయని చెబుతున్నారు.