కరోనా నుంచి కోలుకున్నారా.. ఈ లక్షణాలతో జాగ్రత్త..?

దేశంలో గడిచిన మూడు రోజుల నుంచి కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా బారిన పడే వారి సంఖ్యకు సమానంగా కోలుకునే వారి సంఖ్య కూడా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామందిని జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, ఇతర లక్షణాలు వేధిస్తున్నాయి. కరోనా నెగిటివ్ వచ్చినా లక్షణాలు కనిపిస్తూ ఉండటంతో కరోనా బాధితులు పడుతున్న టెన్షన్ అంతాఇంతా కాదు. కరోనాను నిర్లక్ష్యం చేసిన వాళ్లే ఎక్కువగా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వాళ్లకే […]

Written By: Navya, Updated On : May 16, 2021 11:44 am
Follow us on

దేశంలో గడిచిన మూడు రోజుల నుంచి కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కరోనా బారిన పడే వారి సంఖ్యకు సమానంగా కోలుకునే వారి సంఖ్య కూడా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో చాలామందిని జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, ఇతర లక్షణాలు వేధిస్తున్నాయి. కరోనా నెగిటివ్ వచ్చినా లక్షణాలు కనిపిస్తూ ఉండటంతో కరోనా బాధితులు పడుతున్న టెన్షన్ అంతాఇంతా కాదు. కరోనాను నిర్లక్ష్యం చేసిన వాళ్లే ఎక్కువగా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నారు.

ఇలాంటి వాళ్లకే ఐసీయూలో ఆక్సిజన్ అవసరం కావడంతో పాటు స్టెరాయిడ్స్ ఇస్తే మాత్రమే కోలుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైతే స్టెరాయిడ్స్ ను వాడుతున్నారో వారిలో షుగర్ లెవెల్స్ కూడా భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వాళ్లను జ్వరం, ఒళ్లునొప్పులు, కీళ్లనొప్పులు, తలనొప్పి, అలసట, నీరసం, కంగారు, కళ్లు తిరగడం, ఆకలి తగ్గడం లాంటి సమస్యలు వేధిస్తున్నాయి.

కోలుకున్న తరువాత చేతులు నీలిరంగులోకి మారడం, నడిస్తే ఆయాసం రావడం, ఆక్సిజన్ లెవెల్స్ 94 శాతం కంటే తగ్గడం, తీవ్రమైన దగ్గు, అయోమయ స్థితి తలనొప్పి, ఛాతీ పట్టేసినట్లు ఉండటం, నోటిపూత, కాళ్లవాపులు, ఆహారం మింగడంలో సమస్యలు, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. శరీరంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

కరోనా నుంచి కోలుకున్న తరువాత వ్యాయామానికి తగినంత సమయం కేటాయించడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు మందులు తప్పనిసరిగా వాడాలి. కనీసం రోజుకు 8 గంటల సమయం నిద్రపోవాలి. రక్తం చిక్కబడకుండా మందులు వాడటంతో పాటు మధుమేహాన్ని నియంత్రించుకోవాలి.