కరోనా వాస్తవ లెక్కలు చెప్పాలంటున్న మోడీ

135 కోట్ల భారతదేశం.. భారీ జనసాంద్రత.. ఇంత పెద్ద దేశంలో కరోనా సెకండ్ వేవ్ తో జనం ఆస్పత్రుల వెంటపడుతున్నారు. మందులు, బెడ్స్ ఖాళీ లేక, ఆక్సిజన్ కొరతతో వేల మంది ప్రాణాలు పోతున్నాయి. అయితే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో టెస్టులు తక్కువగా చేస్తూ కేసులు, మరణాలు దాస్తున్నారని అక్కడి హైకోర్టు స్వయంగా ఆరోపించింది. ఇలాంటివి దేశంలో ఎన్నో.. దేశంలో కరోనా రోగులు, మరణాలు వంటి వాటిపై రాష్ట్రాలు తప్పుడు సమాచారం ఇస్తున్నాయి. ఇప్పుడు ఇదే కేంద్రానికి […]

Written By: NARESH, Updated On : May 16, 2021 11:19 am
Follow us on

135 కోట్ల భారతదేశం.. భారీ జనసాంద్రత.. ఇంత పెద్ద దేశంలో కరోనా సెకండ్ వేవ్ తో జనం ఆస్పత్రుల వెంటపడుతున్నారు. మందులు, బెడ్స్ ఖాళీ లేక, ఆక్సిజన్ కొరతతో వేల మంది ప్రాణాలు పోతున్నాయి. అయితే తెలంగాణ వంటి రాష్ట్రాల్లో టెస్టులు తక్కువగా చేస్తూ కేసులు, మరణాలు దాస్తున్నారని అక్కడి హైకోర్టు స్వయంగా ఆరోపించింది. ఇలాంటివి దేశంలో ఎన్నో.. దేశంలో కరోనా రోగులు, మరణాలు వంటి వాటిపై రాష్ట్రాలు తప్పుడు సమాచారం ఇస్తున్నాయి.

ఇప్పుడు ఇదే కేంద్రానికి అనుమానం వచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నిర్వహించిన కరోనా సమీక్షలో రాష్ట్రాలు దాస్తున్న కరోనా కేసులు, మరణాలపైనే అధికారులకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రాలు ఖచ్చితమైన లెక్కలు చెప్పేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.

కానీ మోడీ చెప్పినట్టు దేశంలోని ఏ రాష్ట్రం కూడా కరోనాపై ఖచ్చితమైన లెక్కులు అస్సలు చెప్పడం లేదు. లెక్కలను ఎవరూ నమ్మడం లేదు కూడా. ఏ రాష్ట్రంలో చూసినా మరణాలు వందలోపే ఉంటున్నాయి. కానీ స్మశానాల్లో మాత్రం 24 గంటలు మరణించిన వారి చితులు కాల్చడానికి ఆలస్యం అవుతోంది. అంటే దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలను రాష్ట్రాలు దాస్తున్నట్టే లెక్క. కరోనాతో మరణించిన అన్నింటిని లెక్కలోకి తీసుకుంటే దేశంలో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ ఇప్పుడు కరోనా కేసులను, మరణాలను తక్కువ చేసి చూపిస్తున్నాయి. ఒక్క కేరళలాంటి రాష్ట్రాలు మాత్రం నిక్కచ్చిగా కేసులు, మరణాలు చెప్పి ప్రజలకు అవగాహన కల్పించి కట్టడి చేస్తున్నాయి.

నిజానికి దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాలపై కేంద్రానికి అనుమానాలున్నాయి. కానీ రాష్ట్రాలు ఇచ్చే సమాచారం తప్ప.. కేంద్రానికి ఎలాంటి సొంత లెక్కింపు లేదు.అందుకే కేంద్రం కూడా అసలైన కరోనా పరిస్థితిపై దేశంలో అవగాహనకు రాలేకపోతోంది.

ప్రధాని మోడీ చెప్పినట్లుగా రాష్ట్రాలన్నీ సరైన లెక్కలు చెబితే.. దేశంలో కరోనా ఎంతటి తీవ్రంగా ఉందో కేంద్రానికి తెలుస్తుంది. తద్వారా తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. రాష్ట్రాలన్నీ రాజకీయం సొంత ప్రయోజనాలు పక్కనపెట్టి కరోనాపై అసలు లెక్కలు చెబితేనే దేశాన్ని ఈ ఉపద్రవం నుంచి కాపాడడానికి కేంద్రానికి మార్గం సుగమం అవుతుంది. లేదంటే ఈ విపరీత పరిణామాలు కొనసాగుతూనే ఉంటాయి.