ఏపీ రాజకీయాల్లో నెల్లూరు పెద్దారెడ్ల ఆధిపత్యం కొనసాగుతోంది. జిల్లాల్లో వారి ప్రాబల్యమే ఎక్కువగా ఉంటోంది. దీంతో రాజకీయాల్లో తమ మార్కు ఉండాలని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారు ఎవరికి మద్దతు పలికితే వారే అధికారంలోకి వస్తారు. దీంతో నాలుగు దశాబ్దాలుగా అన్ని పార్టీల్లో రెడ్లు పాతుకుపోయారు. రెడ్లు కాంగ్రెస్, టీడీపీలను వదిలి వైసీపీలో చేరారు. అయితేరెడ్ల ఆశలు నెరవేరలేదు.
సీనియార్టీకేదీ విలువ
ఏ పార్టీలో ఉన్నా సీనియార్టీకి విలువ లేకుండా పోతోందని రెడ్ల నిరాశ చెందుతున్నారు. పార్టీల్లో సీనియర్లను కాదని జూనియర్లకే పెత్తనం ఇస్తున్నారు. దీంతో రెడ్లు కినుక వహిస్తున్నారు. నెల్లూరు రెడ్ల కోసం ఏ పార్టీ కూడా పూర్తిస్థాయిలో పదవులు కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు మా వాడివే అని చెబుతున్నారే కాని పదవి ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు. పని లేదు.. పైసా లేదు అన్న చందంగా మారింది పరిస్థితి.
రెడ్డి ఎమ్మెల్యేలున్నా..
నెల్లూరు జిల్లాలో మెజార్టీ స్థానాల్లో రెడ్డి ఎమ్మెల్యేలుండగా వారికి పదవులు దక్కడం లేదు. దీంతో వారంతా నిరాశ చెందుతున్నారు. జిల్లాలో మంత్రి అనిల్ పెత్తనమే కొనసాగుతోంది. జగన్ తో అనిల్ కు సంబంధాలు బాగుండడంతో రెడ్ల ప్రాబల్యం సాగడం లేదు. ఫలితంగా అన్ని కార్యక్రమాలు ఆయనకే అప్పగిస్తున్నారు. దీంతో రెడ్ల వర్గం ఎలాగైనా తమ ఆధిపత్యం పెంచుకోవడానికి ప్రాధాన్యం వహించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ ఆగడాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు.
నామినేటెడ్ పదవులు ఇస్తామన్నా..
రెడ్డి నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తామన్నా వినిపించుకోవడం లేదు. దీంతో తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ క్రమంలో నెల్లూరు రెడ్డి ప్రజాప్రతినిధులతో పాటు పెద్దారెడ్డి సంఘం నేతలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో అధిష్టానం బుజ్జగింపులకు ప్రాముఖ్యత ఇస్తోంది. ఏది ఏమైనా నెల్లూరు పెద్దారెడ్ల ప్రాబల్యం పెరుగుతోందో లేదో వేచి చూడాలి మరి.