https://oktelugu.com/

శోభ‌న్‌బాబును అలా చూసి.. మహిళా అభిమానులు !

సోగ్గాడు.. ఈ పదం విన్న వెంటనే.. అలనాటి ‘అందాల హీరో శోభన్‌బాబు’ గుర్తుకు వస్తారు. చాలామంది హీరోలకు అందం ఉంటుంది. కానీ, అందానికి పర్యాయపదం అంటే మాత్రం శోభన్‌బాబునే. అప్పటి మహిళా లోకానికి కలల రాకుమారుడిగా తిరుగులేని ఫాలోయింగ్ తో ఎవ్వరికీ సాధ్యం కానీ కీర్తిని సంపాధించుకున్న హీరో కూడా శోభన్‌బాబునే. అందుకే ఆయన సినిమాలు కూడా ఎక్కువుగా మహిళల మనోభావాల మీదే నడిచేవి. ఆయనను ప్రేమించిన హీరోయిన్లు.. చివరకు ఆయన కోసం త్యాగమూర్తులుగా మారే కథాంశాలే […]

Written By:
  • admin
  • , Updated On : March 25, 2021 / 10:28 AM IST
    Follow us on


    సోగ్గాడు.. ఈ పదం విన్న వెంటనే.. అలనాటి ‘అందాల హీరో శోభన్‌బాబు’ గుర్తుకు వస్తారు. చాలామంది హీరోలకు అందం ఉంటుంది. కానీ, అందానికి పర్యాయపదం అంటే మాత్రం శోభన్‌బాబునే. అప్పటి మహిళా లోకానికి కలల రాకుమారుడిగా తిరుగులేని ఫాలోయింగ్ తో ఎవ్వరికీ సాధ్యం కానీ కీర్తిని సంపాధించుకున్న హీరో కూడా శోభన్‌బాబునే. అందుకే ఆయన సినిమాలు కూడా ఎక్కువుగా మహిళల మనోభావాల మీదే నడిచేవి. ఆయనను ప్రేమించిన హీరోయిన్లు.. చివరకు ఆయన కోసం త్యాగమూర్తులుగా మారే కథాంశాలే శోభన్ బాబు సినిమాల్లో ఎక్కువుగా కనిపిస్తోంది.

    Also Read: అవ‌స‌రాల శ్రీనివాస్ వైరల్ వీడియో వెనుక కథ ఇదా?

    అయితే శోభ‌న్‌బాబు తన శైలికి భిన్నంగా కూడా కొన్ని అపురూపమైన చిత్రాల్లో నటించారు. అలాంటి చిత్రాల్లో ముఖ్యంగా శోభ‌న్‌బాబు న‌టించి మెప్పించిన చిత్రం ‘చెల్లెలి కాపురం’ సినిమా ప్రముఖ మైనది. అందాల హీరో అనే త‌న‌కున్న క్రేజీ ఇమేజ్‌ను ప‌క్క‌న పెట్టి.. మొదటిసారి డీ గ్లామరైజ్డ్ రోల్ ‌లో ఆయన నటించడం అనేది.. ఒక గొప్ప సాహసం. ఆ రోజుల్లో ఈ సినిమా పోస్టర్ లో డీ గ్లామరైజ్డ్ లుక్ లో శోభన్ బాబును చూసి.. ఆయన మహిళా అభిమానులు ఆ పోస్టర్స్ ను చించేశారట. అంటే.. అంతగా వాళ్ళు శోభన్ బాబును ఆరాధించేవారు.

    Also Read: నటి పవిత్ర లుక్స్ అదిరిపోలా?

    తన జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగినవి కాబట్టే.. ఆయన వయసు అయిపోయాక చివరి రోజుల్లో బయట ప్రపంచానికి తనలోని ముసలితనాన్ని చూపించడానికి ఇష్టపడలేదు. ఇక చెల్లెలి కాపురం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం శోభ‌న్‌బాబు తీసుకున్న పారితోషకం అక్ష‌రాల ప‌దిహేను వేల రూపాయ‌లు. నిజానికి ఈ సినిమాకి ఆయన చాల తక్కువ తీసుకున్నారు. కారణం, న‌టుడు మ‌న్నవ బాల‌య్య నిర్మాత‌గా మారి అమృతా ఫిలింస్ బేన‌ర్ ‌పై నిర్మించిన తొలి చిత్రం ఇదే. అందుకే శోభన్ తన తోటి నటుడికి సాయం చేయాలనే ఆలోచనతో తన రెమ్యూనరేష్ ను కూడా తగ్గించుకున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్