పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమా అంటే ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్. నేషనల్ యాక్టర్ రానాతో కలిసి పవన్ ఈ సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్న దగ్గర నుండి.. పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఏకైక అంశం.. ఈ సినిమాలో పవన్ లుక్ ఎలా ఉండబోతుంది ? అసలు పవన్ సరసన ఎవరు నటించబోతున్నారు? అలాగే పవన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి ? ఇలా రకరకాలుగా అనేక ప్రశ్నలు పవన్ ఫ్యాన్స్ లో మెదులుతున్నాయి.
Also Read: నటి పవిత్ర లుక్స్ అదిరిపోలా?
తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటించబోయే నటీనటుల విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో సాయి పల్లవి, రానా భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ ను, అలాగే రానా తండ్రి పాత్రలో సుముద్రఖని, ఇక పవన్ కళ్యాణ్ స్నేహితుడి పాత్రలో బ్రహ్మాజీని, పవన్ కళ్యాణ్ సీనియర్ ఆఫీసర్ పాత్రలో మురళీశర్మను, పవన్ అసిస్టెంట్ పాత్రలో వెన్నెల కిషోర్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. అదే విధంగా ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ లో హీరోయిన్ సురభిని తీసుకోబోతున్నారని సమాచారం.
Also Read: శోభన్‌బాబును అలా చూసి.. మహిళా అభిమానులు !
మొత్తానికి ఈ క్రేజీ రీమేక్ లో నటీనటుల లిస్ట్ ను చూస్తుంటే.. పాత్రలకు తగ్గట్టు నటీనటులను ఎంపిక చేసుకున్నట్టు అర్ధం అవుతుంది. పైగా ఇప్పటికే నటీనటులు అందరికీ అడ్వాన్స్ లు కూడా ఇచ్చారట. పవన్ – రానా హీరోలుగా రూపొందుతోన్న ఈ మల్టీస్టారర్ ను పాన్ ఇండియా మూవీగా తీసుకురావడానికి మేకర్స్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరి మలయాళంలో హిట్ అయిన ఈ సినిమా నేషనల్ రేంజ్ లో కూడా ఆ స్థాయిలోనే హిట్ అవుతుందా ? చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్