https://oktelugu.com/

Karthika Deepam January 26 Episode: దారుణంగా మారిన డాక్టర్ బాబు పరిస్థితి.. ఆఖరికి వంటలక్క కూడా దూరం పెట్టేసిందిగా!

Karthika Deepam January 26 Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ప్రసారమయ్యే హైలెట్ ఏంటో చూద్దాం. హిమ, సౌర్య.. దీప దగ్గరికి వచ్చి రుద్రాణి మనుషులు తమను కలిశారన్న విషయాని చెబుతారు. దాంతో దీప భయపడుతూ ఏం కాదులేండి అని పిల్లలకు నచ్చచెప్పి తను ఆలోచనలో పడుతుంది. మరోవైపు హోటల్లో అప్పారావు సినిమాకి వెళ్లడానికి బాగా తిప్పలు పడుతూ ఉంటాడు. కార్తీక్ కు తన పనిని కూడా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. మోనిత […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 26, 2022 / 09:25 AM IST
    Follow us on

    Karthika Deepam January 26 Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ప్రసారమయ్యే హైలెట్ ఏంటో చూద్దాం. హిమ, సౌర్య.. దీప దగ్గరికి వచ్చి రుద్రాణి మనుషులు తమను కలిశారన్న విషయాని చెబుతారు. దాంతో దీప భయపడుతూ ఏం కాదులేండి అని పిల్లలకు నచ్చచెప్పి తను ఆలోచనలో పడుతుంది. మరోవైపు హోటల్లో అప్పారావు సినిమాకి వెళ్లడానికి బాగా తిప్పలు పడుతూ ఉంటాడు.

    Karthika Deepam January 26 Episode

    కార్తీక్ కు తన పనిని కూడా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. మోనిత తన ఫోటో చూసుకుంటూ.. తన అందాన్ని పొగుడుకుంటుంది. అంతలోనే డాక్టర్ భారతి వస్తుంది. ఇక కాసేపు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు దీప బాబు ని ఎత్తుకొని హోటల్ కి వెళ్తుంది. మధ్యలో అప్పారావు కనిపించడంతో కాసేపు అతడితో మాట్లాడుతుంది.

    మోనిత పని మీద బయటకు వెళ్లడంతో అక్కడ ఆదిత్య కనిపిస్తాడు. ఆదిత్యను కలుగజేసుకొని వెటకారంగా పలకరిస్తుంది. ఆదిత్య మాత్రం మోనిత ఎదురు పడినందుకు కోపంతో రగిలిపోతాడు. ఇక మోనిత కార్తీక్ గురించి అడగడంతో ఆదిత్య తనకు దండం పెడుతూ మా ఫ్యామిలీ జోలికి రావద్దని చెప్పి వెళ్ళిపోతాడు.

    Also Read: Karthika Deepam January 25 Episode: హోటల్లో పనిచేస్తున్న కార్తీక్ ను చూసి కన్నీటితో మునిగిపోయిన వంటలక్క!

    ఇక అక్కడ ఆదిత్య ఫోన్ మర్చిపోవటంతో ఫోన్ చూసి కారు కింద పెట్టి మొక్కలు చేస్తుంది. ఇక కార్తీక్ పార్సల్ ఇవ్వడానికి వెళ్లాలని అనుకుంటాడు. కానీ యజమాని తాను వెళతానని చెప్పి వెళ్తాడు. అంతలోనే దీప అక్కడికి వస్తుంది. చీటీ గురించి మాట్లాడుతూ ఉండగా యజమాని ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోతాడు.

    దీప లోపల కౌంటర్ దగ్గర ఉంటుంది. అక్కడే ఎదురుగా కార్తీక్ టేబుల్ శుభ్రం చేస్తూ కనిపిస్తాడు. అది చూసిన దీప ఏవండి అంటూ బాగా ఏడుస్తుంది. తరువాయి భాగంలో దీప కోపంతో రగిలిపోతుంది. కార్తీక్ ను దూరం పెడుతుంది. డాక్టర్ గా ఉన్న కార్తీక్ పాచి పనులు చేయటం చూస్తే కార్తీక్ పరిస్థితి దారుణంగానే మారిందని తెలుస్తుంది.

    Also Read: ఈ స్టార్ హీరోయిన్లు మేకప్ లేకుండా ఎలా ఉంటారో చూడండి..