LIC Policy For Elders: వృద్ధులకు ఎల్ఐసీ శుభవార్త.. సంవత్సరానికి రూ.లక్షకు పైగా పెన్షన్!

LIC Policy For Elders: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా అమలు చేస్తున్న పాలసీలలో ప్రధానమంత్రి వయ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. 2023 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు ఈ పాలసీ అమలులో ఉండనుంది. కనీసం 60 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. ఈ పాలసీ కాల వ్యవధి 10 సంవత్సరాలుగా ఉండనుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు […]

Written By: Kusuma Aggunna, Updated On : January 26, 2022 3:16 pm
Follow us on

LIC Policy For Elders: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా అమలు చేస్తున్న పాలసీలలో ప్రధానమంత్రి వయ వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. 2023 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు ఈ పాలసీ అమలులో ఉండనుంది. కనీసం 60 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. ఈ పాలసీ కాల వ్యవధి 10 సంవత్సరాలుగా ఉండనుంది. ఈ పాలసీ తీసుకున్న వాళ్లు ఏడాదికి గరిష్టంగా 1,20,000 రూపాయల పెన్షన్ ను పొందవచ్చు.

LIC Policy For Elders

కేంద్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి సామాజిక భద్రతా పథకం కింద ఈ పాలసీని అమలు చేస్తుండటం గమనార్హం. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులను నెలనెలా తీసుకోవడం, మూడు నెలలకు ఒకసారి తీసుకోవడం, ఆరు నెలలకు ఒకసారి తీసుకోవడం, ఏడాదికి ఒకసారి తీసుకోవడం చేయవచ్చు. ఈ ఆప్షన్లలో నచ్చిన ఆప్షన్ ను ఎంపిక చేసుకుని పెన్షన్ ను పొందవచ్చు.

Also Read: LIC Credit Card: ఎల్ఐసీ పాల‌సీదారుల‌కు ఫ్రీగా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలంటే?

ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.4 శాతం వడ్డీ అమలవుతుండటం గమనార్హం. ఈ స్కీమ్ లో కనీసం లక్షన్నర రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 1,000 రూపాయల పెన్షన్ ను పొందవచ్చు. 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే మాత్రం నెలకు 10,000 రూపాయల చొప్పున పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి పొందే పెన్షన్ మొత్తంలో మార్పులు ఉంటాయని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

15 లక్షల రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్లు సంవత్సరానికి 1,20,000 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్లకు ఎంతగానో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. సమీపంలోని ఎల్.ఐ.సీ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

Also Read: వాట్సాప్ సరికొత్త ఫీచర్.. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పేలతో పోటీ..