
ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా వకీల్ సాబ్. మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ తెరపై కనిపించబోతుండడంతో.. ఆ రిజల్ట్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు ఊస్తున్నారు. అయితే.. రియాక్షన్ మాత్రం దుమ్ము లేచిపోయేలా కనిపిస్తోంది.
మార్చి 29న విడుదలైన ట్రైలర్ పవర్ స్టార్ స్టామినా ఏంటో చాటి చెప్పింది. విడుదలైన 24 గంటల్లోనే దాదాపు 18 మిలియన్ల పైచిలుకు వ్యూ\స్ తో టాలీవుడ్ చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్ రికార్డులను నమోదు చేసింది. పవర్ స్టార్ తనకు మాత్రమే సొంతమైన పెర్ఫార్మెన్స్ తో ఇరగదీయగా.. దర్శకుడు అత్యంత ఆసక్తిగా ట్రైలర్ ను కట్ చేశాడు. దీంతో.. అప్పటి వరకూ సాధారణంగా ఉన్న వకీల్ సాబ్ ప్రచారం.. ఒక్క ట్రైలర్ తో ఆకాశానికి ఎగిరింది.
ఇక, ఈ సినిమాలో బిగ్ సర్ ప్రైజ్ ఉండబోతోందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ చిత్రంలో కొన్ని నిమిషాల పాటు మెగా హీరో కనిపించబోతున్నారన్న సమాచారం లీకైంది. దీంతో.. అది ఎవరై ఉంటారనే డిస్కషన్లో మునిగిపోయారు ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవినా? లేక మెగాపవర్ స్టార్ రామ్ చరణా? ఇంకా మరెవరైనా అయ్యుంటారా? అని చర్చించుకుంటున్నారు. అర్జెంటుగా సినిమా చూసేసి, ఆతృత చల్లార్చుకోవాలనే భావనలో ఉన్నారు ఫ్యాన్స్. ఇలాంటి సమయంలోనే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్.. టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో ప్రసారమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ను ఏకంగా లక్షా 36 వేల మంది వీక్షించారు. ఇప్పటి వరకూ తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో చిత్రానికి కూడా ఈ రేంజ్ లో వ్యూస్ రాలేదు. అయితే.. రెండో స్థానంలోనూ పవన్ చిత్రమే ఉండడం గమనార్హం. అంటే.. ఈ రికార్డు కన్నా ముందు కూడా పవన్ సినిమానే రికార్డ్ నెలకొల్పింది.
పవన్ 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాత వాసి ప్రీ-రిలీజ్ వేడుకను లక్షా 20 వేల మంది లైవ్ కవరేజ్ ద్వారా వీక్షించారు. ఇది కూడా అప్పటి వరకూ ఇండస్ట్రీ రికార్డు. దీన్ని పవనే స్వయంగా బద్ధలు కొట్టడం విశేషం. దీంతో.. ట్రెండ్ సెట్ చేయాలన్నా పవర్ స్టారే.. దాన్ని తిరగరాయాలన్నా పవర్ స్టారే అన్న విషయం మరోసారి రుజువైందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.