Unstoppable with NBK: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒకవైపు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరోవైపు ఆహాలో అన్ స్టాపబుల్ అనే టాక్ షోను చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ టాక్ షో కు మొదటి అతిథిగా మంచు మోహన్ బాబు, లక్ష్మీ మంచు, అలాగే మంచు విష్ణు హాజరయ్యి ఎంతో సరదాగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందించారు.ఈ క్రమంలోనే బాలకృష్ణ మోహన్ బాబును ఉద్దేశించి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వేస్తూ ఆద్యంతం ఈ కార్యక్రమంపై ఆతృత ఏర్పడేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇదిలా ఉండగా మొదటి ఎపిసోడ్ విజయవంతం కావడంతో రెండవ ఎపిసోడ్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి రెండవ అతిధి ఎవరు రాబోతున్నారు అంటూ పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. అయితే రెండవ అతిథిగా ఫలానావారు రాబోతున్నారు అంటూ కొందరి పేర్లు వినిపించినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా రెండవ ఎపిసోడ్ కి నాచురల్ స్టార్ నాని రాబోతున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది.
నాని గతంలో నటించిన కృష్ణ గాడి వీర ప్రేమగాధ సినిమాలో బాలయ్యకు పెద్ద అభిమానిగా నటించారు. ఈ క్రమంలోనే నాని చేతి మీద టాటూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ రెండవ ఎపిసోడ్ కు రాబోయే అతిథి ఎవరో చెప్పండి అంటూ కోరిన ఆహా నిర్వాహకులు ఆ తర్వాత ఒకడు సెల్ఫ్ మేడ్ అనే పదానికి ఇంటి పేరు నాని మా అన్ స్టాప్ బుల్ సెకండ్ గెస్ట్ అనే విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే వీరిద్దరికీ సంబంధించిన రెండవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ను నేడు 5:04 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.