తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా వెలుగొందారు ఎన్టీఆర్, ఏఎన్నార్. అయితే.. వీరిలో ఎవరు సీనియర్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ స్టార్ డమ్ ను చూసి ఆయనే సీనియర్ అనుకుంటారు. కానీ.. వాస్తవం వేరు. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చే నాటికే.. అక్కినేని పెద్ద స్టార్.
Also Read: టాలీవుడ్ పై పిడుగు: తెలంగాణలో థియేటర్లు మళ్లీ బంద్?
1949లో ఎన్టీఆర్ చిత్రపరిశ్రమకు వచ్చారు. అప్పటికే ఏఎన్నార్.. పల్నాటి యుద్ధం, బాలరాజు, కీలుగుర్రం, లైలామజ్ను వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు. నాగయ్య, చదలవాడ లాంటి హీరోలు ఉన్నప్పటికీ.. వాళ్లు సీనియర్ అయిపోయారు. దీంతో.. మంచి కటౌట్ తో ఉండే అక్కినేని వేగంగా ఫేమస్ అయ్యారు. ఆ విధంగా క్షణం తీరికలేకుండా షూటింగులకు హాజరు కావాల్సి వచ్చేది.
ఆ సమయంలోనే ఎన్టీఆర్ అనే కుర్రాడు ఇండస్ట్రీకి వచ్చాడని అక్కినేనికి తెలిసింది. ఆయన్ను చూసిన తర్వాత తన భారం తగ్గించేవాడు వచ్చాడని అనుకున్నారట ఏఎన్నార్. అయితే.. నీకు పోటీగా ఉన్నారంటూ కొందరు ఎగదోసే ప్రయత్నం చేసినా.. వీరిద్దరూ పట్టించుకోకుండా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. వీళ్లిద్దరూ కలిసి రోజూ బ్యాడ్మింటెన్ ను ఆడేవారు.
Also Read: రానాకు గట్టి షాక్.. ‘అరణ్య’ మూవీ విషయంలో భారీ దెబ్బ
ఓ రోజు వీళ్ల ఆట చూసిన కేవీరెడ్డి.. ఎన్టీఆర్ నచ్చి పాతాళభైరవి సినిమాలో అవకాశం ఇచ్చాడట. ఆ సినిమా విజయంతో ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిరిగింది. వేగంగా టాప్ స్టార్ గా మారిపోయారు. అయినప్పటికీ.. వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. ఇద్దరూ కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు.
అయితే.. మరి, వీరిలో ఎవరు పెద్ద అన్నప్పుడు రెండు విషయాలు ఉన్నాయి. వయసు పరంగా చూసినప్పుడు ఎన్టీఆర్ పెద్దవాడు. అక్కినేని కన్నా దాదాపు సంవత్సరంన్నర పెద్ద. అయితే.. సినిమా ఇండస్ట్రీలో సీనియారిటీ విషయానికి వస్తేమాత్రం.. అక్కినేని చాలా పెద్ద. ఎన్టీఆర్ కన్నా దాదాపు ఆరు సంవత్సరాల సీనియర్. అయినప్పటికీ.. తానే పెద్ద అనే ఫీలింగ్ వీరిలో ఎవరికీ, ఎక్కడా కనిపించేది కాదు. ఆ విధంగా.. చివరి వరకు తమ స్నేహాన్ని పదిలంగా కాపాడుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్