9 భాషల్లో రీమేక్ అయిన తొలి తెలుగు సినిమా ఇదే

ప్రభుదేవా.. ఒక డ్యాన్స్ మాస్టర్ గా కెరీర్ ప్రారంభించి.. అనంతరం హీరోగా ఎదిగి.. ఇప్పుడు దర్శకుడిగా స్థిరపడ్డ మల్టీ టాలెంటెడ్. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో టాలీవుడ్ గొప్ప హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు విజయవంతమయ్యాయి. ప్రభుదేవా డైరెక్షన్ చేసిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ 2005లో వచ్చిన ఈ సినిమా పెద్ద సంచలనమే సృష్టించింది. లవ్ సినిమాలకు క్రేజ్ ఉన్న ఆ సమయంలో ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. […]

Written By: NARESH, Updated On : April 5, 2021 4:40 pm
Follow us on

ప్రభుదేవా.. ఒక డ్యాన్స్ మాస్టర్ గా కెరీర్ ప్రారంభించి.. అనంతరం హీరోగా ఎదిగి.. ఇప్పుడు దర్శకుడిగా స్థిరపడ్డ మల్టీ టాలెంటెడ్. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో టాలీవుడ్ గొప్ప హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు విజయవంతమయ్యాయి.

ప్రభుదేవా డైరెక్షన్ చేసిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ 2005లో వచ్చిన ఈ సినిమా పెద్ద సంచలనమే సృష్టించింది. లవ్ సినిమాలకు క్రేజ్ ఉన్న ఆ సమయంలో ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అయ్యి కూడా సంచలన విజయాలను అందుకుంది.

సాధారణంగా ఒక సినిమా హిట్టు కొట్టిన తరువాత ఇతర భాషల్లో రీమేక్ చేస్తారు. అక్కడి నటులతో దాన్ని మళ్లీ తీస్తారు. కానీ కరోనా కల్లోలంతో ఓటీటీలు వచ్చాక ఒక భాషలోని సినిమాను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. కానీ కొన్నేళ్ల కిందట ఈ సంస్కృతి లేదు. 2005లో తెలుగులో విజయం సాధించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాను 9 భాషల్లో రీమేక్ చేశారు. దేశీయ సినిమా రంగంలోనే ఇదో రికార్డ్ గా చెప్పొచ్చు. దేశీయ భాషల్లోనే కాకుండా నేపాల్ లోనూ ఈ సినిమా కథను తీసుకొని సినిమా తీయడం విశేషం.. అన్ని భాషల్లోనూ ఈ సినిమా హిట్ కావడం విశేషమే మరీ..

తెలుగులో స్వయంగా దర్శకత్వం వహించిన ప్రభుదేవా ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేశారు. అక్కడ దీనికి ‘రామయ్యా వస్తావయ్యా’ అనే పేరు పెట్టారు. అక్కడ కూడా ఈ సినిమా హిట్ కొట్టడం విశేషం. ఇక తమిళంలో ‘ఉనక్కం ఎనక్క’ పేరుతో రీమేక్ చేసి విడుదల చేశారు. కన్నడంలో ‘నీనెల్లో నానల్లే’ అనే పేరుతో రీమేక్ చేశారు.
బెంగాలీలో ‘నిస్సా అమర్ తుమీ’ అనే పేరుతో మళ్లీ తీసి విడుదల చేశారు. బంగ్లా లో ‘ఐలవ్ యూ’ పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేశారు. పంజాబీలో ‘తేరా మేరా కీ రిష్తా’ పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేశారు. ‘సునా ఛాదీ మో రూపా ఛాదీ’ అనే పేరుతో ఒడిశాలో మళ్లీ తీసి విడుదల చేశారు. మణిపురిలో ‘నింగోల్ తజబ’ అనే పేరుతో విడుదల చేశారు. నేపాలీ భాషలో ‘ది ఫ్లాష్ బ్లాక్: ఫర్కెరా హెర్దా’ అనే పేరుతో మళ్లీ తీశారు. అన్ని చోట్ల ఈ సినిమా హిట్ అయ్యి రికార్డులు తిరగరాసింది.