https://oktelugu.com/

వారసుడి రాక ఫిక్స్.. ఆనందడోలికలలో అభిమానులు !

ఒక స్టార్ హీరో ఫ్యామిలీ నుండి ఒక కొత్త హీరో వస్తున్నాడంటే.. ఆ ఫ్యామిలీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులలో కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. అయితే, ఇది మాత్రం నందమూరి అభిమానులలో ఎప్పటి నుండో ఉన్న కల. తమ స్టార్ హీరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వాలని, నందమూరి బాలయ్య సినీ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని ఎప్పటినుండో ఆశ పడుతున్నారు బాలయ్య అభిమానులు. కానీ, మోక్షజ్ఞకు యాక్టింగ్ పై ఇంట్రస్ట్ లేకపోయేసరికి.. పాపం […]

Written By:
  • admin
  • , Updated On : April 5, 2021 / 04:42 PM IST
    Follow us on


    ఒక స్టార్ హీరో ఫ్యామిలీ నుండి ఒక కొత్త హీరో వస్తున్నాడంటే.. ఆ ఫ్యామిలీ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులలో కూడా ఎంతో ఆసక్తి ఉంటుంది. అయితే, ఇది మాత్రం నందమూరి అభిమానులలో ఎప్పటి నుండో ఉన్న కల. తమ స్టార్ హీరో వారసుడు హీరోగా ఎంట్రీ ఇవ్వాలని, నందమూరి బాలయ్య సినీ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని ఎప్పటినుండో ఆశ పడుతున్నారు బాలయ్య అభిమానులు. కానీ, మోక్షజ్ఞకు యాక్టింగ్ పై ఇంట్రస్ట్ లేకపోయేసరికి.. పాపం బాలయ్య కూడా ఏమి చేయలేక ఎవ్వరికీ ఏమి చెప్పలేక ఇక తానే వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ ముందుకు పోతున్నాడు.

    ఇలాంటి టైంలో మోక్షజ్ఞ అందరికీ షాక్ ఇచ్చేలా ఉన్నాడు. గత మూడు నెలలు నుండి తన ఫిజిక్ పై మోక్షజ్ఞ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఆ మధ్య ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో కనిపించిన మోక్షజ్ఞ, అప్పుడు బాగా లావుగా కాస్త పొట్టతో మొత్తానికి హీరో అయ్యే లక్షణాలు ఏ మాత్రం తనలో లేవు అన్నట్టు కనిపించాడు. కానీ. ప్రస్తుత మోక్షజ్ఞ లుక్ మాత్రం అదిరిపోయేలా ఉందట. పూర్తి స్లిమ్ గా సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నవాడిలా మారిపోయాడట. ఇక తన లుక్ ఛేంజ్ చేసింది సినిమా చేయడానికే అని బాలయ్య సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం.

    ఇదే నిజం అయితే నందమూరి ఫాన్స్ తెగ ఖుషి అయిపోతారు. గత నాలుగేళ్లుగా మా యంగ్ హీరో ఎంట్రీ అప్పుడు ఇప్పుడు అంటూ కాలక్షేపం చేసిన బాలయ్య అభిమానులు.. మరి ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీకి ఎలా రియాక్ట్ అవుతారో.. ఎంత హంగామా చేస్తారో చూడాలి. నిజానికి గత నాలుగు నెలలు క్రితం వరకూ తనకు అసలు హీరో అవ్వాలని లేదని మోక్షజ్ఞ అందరికీ క్లారిటీ ఇచ్చాడట. కానీ మళ్ళీ ఎలాగైనా తాను కూడా సినీ రంగంలోనే స్థిరపడాలని.. అది కూడా హీరోగానే అని మోక్షజ్ఞ ఆసక్తి చూపిస్తున్నాడట. మరి మోక్షజ్ఞ హీరోగా ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.