https://oktelugu.com/

మే 7న ‘ఆహా’ ఓటీటీలో థాంక్యూ బ్రదర్

జబర్ధస్త్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’. నిండు గర్భిణిగా అనసూయ ఈ సినిమాలో నటించింది. ఆమెకు సహాయం చేసే యువకుడిగా అశ్విన్ విరాజ్ నటించాడు. వీరిద్దరూ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా తెరకెక్కింది. రమేశ్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రారెడ్డి, తాకర్ బొమ్మరెడ్డి నిర్మిస్తున్న ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు. హీరో అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ లో ఈ మేరకు ‘థాంక్యూ బ్రదర్’ మూవీ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 26, 2021 / 12:21 PM IST
    Follow us on

    జబర్ధస్త్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’. నిండు గర్భిణిగా అనసూయ ఈ సినిమాలో నటించింది. ఆమెకు సహాయం చేసే యువకుడిగా అశ్విన్ విరాజ్ నటించాడు. వీరిద్దరూ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా తెరకెక్కింది.

    రమేశ్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రారెడ్డి, తాకర్ బొమ్మరెడ్డి నిర్మిస్తున్న ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు. హీరో అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ లో ఈ మేరకు ‘థాంక్యూ బ్రదర్’ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

    ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్నట్లు నాగచైతన్య తెలిపాడు. ఇక మే 7 నుంచి ఈ మూవీ ఆహాలో విడుదల కానుంది. అంటే సరిగ్గా వారం తర్వాత ఈ మూవీని ‘ఆహా’ ఓటీటీలో కూడా రిలీజ్ చేయబోతున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

    ఈ సినిమాకు గుణ బాలసుబ్రహ్మణ్యం సంగీతం అందించాడు. సురేష్ రఘతు సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించారు. కాగా సినిమా ట్రైలర్ ఎంతో ఎంతో ఆసక్తిగా ఉందని.. కొత్త కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా బాగుంటుందని నాగచైతన్య తెలిపాడు.

    కరోనా కల్లోలం వల్ల సినిమాలు అన్నీ వాయిదా పడ్డాయి. థియేటర్లలోనూ ఆంక్షలు పెట్టారు. దీంతో అటు థియేటర్లతోపాటు ఆహా ఓటీటీలోనూ దీన్ని రిలీజ్ చేస్తున్నారు.