భారత్ కు అండగా అమెరికా, గూగుల్, మైక్రోసాఫ్ట్

కరోనా విలయంతో అల్లాడుతున్న భారత్ కు సాయం చేసేందుకు మంకు పట్టు పట్టుకొని కూర్చుకున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పట్టు వీడాడు. సొంత డెమోక్రాట్లు, ఇండియన్ అమెరికన్ల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి భారత్ కు సాయం చేస్తామని ప్రకటించారు. గత మొదటి వేవ్ లో అమెరికా అల్లకల్లోలంగా మారిన సమయంలో భారత్ తమకు సాయం చేసిందని.. తాము ఇప్పుడు సాయం చేస్తామని జోబైడెన్ స్వయంగా ట్వీట్ చేశారు. అంతేకాదు.. కోవీషీల్డ్ తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలపై నిషేధాన్ని […]

Written By: NARESH, Updated On : April 26, 2021 12:22 pm
Follow us on

కరోనా విలయంతో అల్లాడుతున్న భారత్ కు సాయం చేసేందుకు మంకు పట్టు పట్టుకొని కూర్చుకున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పట్టు వీడాడు. సొంత డెమోక్రాట్లు, ఇండియన్ అమెరికన్ల నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి భారత్ కు సాయం చేస్తామని ప్రకటించారు.

గత మొదటి వేవ్ లో అమెరికా అల్లకల్లోలంగా మారిన సమయంలో భారత్ తమకు సాయం చేసిందని.. తాము ఇప్పుడు సాయం చేస్తామని జోబైడెన్ స్వయంగా ట్వీట్ చేశారు. అంతేకాదు.. కోవీషీల్డ్ తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నామని.. భారత్ కు వాటిని సరఫరా చేస్తామని జోబైడెన్ తెలిపారు.

ఇక భారత్ లోని కరోనా పరిస్థితులు చూసి నా హృదయం ముక్కలైందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వాపోయారు. భారత్ కు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ తన వనరులు ఉపయోగిస్తుందని.. ఆక్సిజన్ పరికరాల కొనుగోలులో భారత్ కు సాయం చేస్తామని ఆయన ప్రకటించారు. భారత్ కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన అమెరికాకు సత్య కృతజ్ఞతలు తెలిపారు.

ఇక గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా భారత్ కు భారీ విరాళం ప్రకటించారు. దేశంలో కరోనా పరిస్తితులపై తీవ్ర ఆందోళన చెందిన సుందర్ ఏకంగా భారత్ కు సాయం చేసేందుకు రూ.135 కోట్ల భారీ సహాయనిధిని ప్రకటించారు.

ఇక ఒక్కరోజే భారత్ కు అమెరికాతోపాటు భారతీయులే అయిన గూగూల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు సాయం ప్రకటించడం విశేషం.