https://oktelugu.com/

‘తలైవి’ విడుదల.. ఇక వివాదాస్పదాలకు సెన్సార్ లేదు !

కరోనా దెబ్బకు మళ్ళీ సినిమాల ప్లాన్ మారింది. థియేటర్స్ లో తమ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్న నిర్మాతలు ప్రస్తుతం సినిమా వల్ల నష్టపోకుండా ఉండాలని ఆరాట పడుతున్నారు. ఆ ఆరాటపడుతున్న లిస్ట్ లో తలైవి నిర్మాతలు కూడా చేరారు. ఎప్పుడైతే తమిళ ప్రజల అభిమాన దివంగత ముఖ్యమంత్రి అమ్మ ‘జయలలిత’ జీవితాన్ని తెర మీదకు తీసుకువస్తున్నాం అని ప్రకటించారో అప్పటినుండే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. ముఖ్యంగా […]

Written By: , Updated On : April 22, 2021 / 09:13 AM IST
Follow us on

Jayalalitha Biopic
కరోనా దెబ్బకు మళ్ళీ సినిమాల ప్లాన్ మారింది. థియేటర్స్ లో తమ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్న నిర్మాతలు ప్రస్తుతం సినిమా వల్ల నష్టపోకుండా ఉండాలని ఆరాట పడుతున్నారు. ఆ ఆరాటపడుతున్న లిస్ట్ లో తలైవి నిర్మాతలు కూడా చేరారు. ఎప్పుడైతే తమిళ ప్రజల అభిమాన దివంగత ముఖ్యమంత్రి అమ్మ ‘జయలలిత’ జీవితాన్ని తెర మీదకు తీసుకువస్తున్నాం అని ప్రకటించారో అప్పటినుండే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. ముఖ్యంగా అమ్మ జీవితంలో చోటు చేసుకున్న ఓ వివాదాస్పద విషయాలను ఎలా చూపిస్తారు ? అసలు ఆమె జీవితంలోని అపవాదులను టచ్ చేస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు ప్రేక్షుకులు.

అయితే, మేకర్స్ తలైవిని ఏప్రిల్ 23న రిలీజ్ చేస్తున్నాం అని అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేయడంతో అందరూ ఏప్రిల్ 23 కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అంతలో మళ్ళీ కరోనా సెకెండ్ వేవ్ వచ్చి పడింది. అయితే, తలైవి అభిమానుల కోసం మేకర్స్ ఈ సినిమాని ఓటిటీలో టికెట్ పద్దతి ద్వారా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఓటిటీ కాబట్టి సెన్సార్ సమస్య ఉండదు. అలాగే కరోనా తగ్గినతరువాత కూడా మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేస్తారట. మొత్తానికి తలైవి ఓటిటీలో రిలీజ్ అయితే.. నిర్మాతలకు కచ్చితంగా నష్టం అయితే రాదు. ఇక జయలలిత పాత్రలో బోల్డ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కంగనా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తమిళం కూడా నేర్చుకుంది.

కాగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ డైరెక్టర్ ‘ఏ ఎల్ విజయ్’ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో జయలలిత పై జరిగిన కుట్రల్లో ముఖ్యమంత్రి కరుణానిధి పాత్ర ఎంత ఉంది ? తమిళ రాజకీయాలను జయలలిత ఎలా శాసించగలిగింది ? విషయాలను ప్రధానంగా చూపించనున్నారు. అలాగే జయలలిత – ఎంజీఆర్ మధ్య ప్రేమ, సాన్నిహిత్యం ఎంత బలమైనదో కూడా ఈ బయోపిక్ లో క్లారిటీగా చూపించనున్నారు. మొత్తానికి అమ్మ బయోపిక్ లో ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా తెలియనున్నాయి. కాగా ఈ బయోపిక్ తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.