నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటైన ఈ సంస్థ 61 మేనేజర్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అవసరాలకు అనుగుణంగా పోస్టుల సంఖ్యలో స్వల్పంగా మార్పులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి.
http://www.nhidcl.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 61 ఉద్యోగ ఖాళీలలో డిప్యూటీ జనరల్ మేనేజర్ 25, మేనేజర్ 26, అసిస్టెంట్ మేనేజర్ 2, జూనియర్ మేనేజర్ 8 ఉద్యోగాల భర్తీ జరగనుంది. డిగ్రీ లేదా బీఈ, బీటెక్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
2021 సంవత్సరం ఏప్రిల్ 31వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్‌హెచ్ఐడీసీఎల్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఈశాన్య భారతదేశంలో, పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులు పంచుకునే ప్రాంతాల్లో జాతీయ రహదారులను నిర్మించుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు జమ్ముకశ్మీర్ తో పాటు లఢక్, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాలలో పని చేయాల్సి ఉంటుంది.