
సొట్టబుగ్గల సుందరి ‘తాప్సి’ మొత్తానికి మళ్ళీ యూ టర్న్ తీసుకుందట. ఆమె మళ్ళీ సౌత్ లో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి తాప్సి సౌత్ లో సినిమాలు చేయడం ఎప్పుడూ మానలేదు, అయితే ఆమెకు బాలీవుడ్ లో డిమాండ్ క్రియేట్ అవ్వడంతో.. తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కానీ ఈ మధ్య సౌత్ లో కూడా సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది. తానూ హిందీలో మంచి క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ.. స్టార్ డమ్ మాత్రం ఆమెకు అక్కడ రావట్లేదు. కనీసం సౌత్ లో అయినా తనకు ఆ స్టార్ డమ్ తెచ్చుకోవాలని తాప్సి ఆలోచన.
అందుకే వరుస సినిమాలతో సౌత్ లో బిజీగా మారడానికి ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలో తాప్సి తాజాగా ఒక సినిమా ఒప్పుకుంది. అయితే హీరోయిన్ సమంత వదిలేసిన కథను తాప్సి చేయడమే ఆసక్తిని రేపుతోంది. కన్నడలో సూపర్ హిట్టయిన యూ టర్న్ సినిమా దర్శకుడు పవన్ కుమార్ చెప్పిన కథకు ఫస్ట్ సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా పవన్ కుమార్ గతంలో తీసిన యూ టర్న్ తెలుగు రీమేక్ లో కూడా సమంతనే హీరోయిన్. అందుకే సమంత దాదాపు పవన్ కుమార్ సినిమా చేస్తోంది అనుకున్నారు.
కానీ, సమంత గుణశేఖర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉండటంతో.. మొత్తానికి పవన్ కుమార్ కి హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఆ ఛాన్స్ తాప్సి దగ్గరకు వెళ్ళింది. కథ విన్న తాప్సి.. మొత్తానికి సినిమా చేయడానికి అంగీకరించింది. ఈ సినిమా వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమాతోనైనా పవన్ కుమార్ లైఫ్ సెట్ అవుతుందేమో చూడాలి. అయితే నిజానికి ఈ సినిమా చేయడం తనకు ఇష్టం లేదని, అసలు కథ బాగాలేదు అని సమంత ఫీల్ అయిందట. మరి అంత బాగాలేని కథలో తాప్సికి ఏమి నచ్చిందో.