https://oktelugu.com/

బాక్సాఫీస్ రికార్డ్: 100కోట్లు దాటేసిన వకీల్ సాబ్

బాక్సాఫీస్ వద్ద వకీల్ సాబ్ రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఏప్రిల్ 9న శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ 5వ రోజున మరో మైలురాయిని అధిగమించింది. లాక్ డౌన్ తర్వాత 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రంగా రికార్డును అధిగమించింది. లాక్ డౌన్ తర్వాత తొలి 100 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా వకీల్ సాబ్ రికార్డు సృష్టించింది. కరోనా టైంలోనూ పవన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం […]

Written By:
  • NARESH
  • , Updated On : April 14, 2021 / 10:35 AM IST
    Follow us on

    బాక్సాఫీస్ వద్ద వకీల్ సాబ్ రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఏప్రిల్ 9న శుక్రవారం రిలీజ్ అయిన ఈ మూవీ 5వ రోజున మరో మైలురాయిని అధిగమించింది. లాక్ డౌన్ తర్వాత 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రంగా రికార్డును అధిగమించింది. లాక్ డౌన్ తర్వాత తొలి 100 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రంగా వకీల్ సాబ్ రికార్డు సృష్టించింది. కరోనా టైంలోనూ పవన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం విశేషం.

    గత ఐదురోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. తొలిరోజున రూ.32.24 కోట్లు, రెండో రోజు రూ.10.74 కోట్లు, మూడో రోజు రూ.10.39 కోట్లు, 4వ రోజు రూ.4.19 కోట్ల షేర్ వసూలు చేసింది. నాలుగు రోజుల్లో దాదాపు రూ60 కోట్లు రాబట్టింది. ఇక 5వ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల షేర్ సాధిస్తుందనే అంచనాలను ట్రేడ్ వర్గాలు వేస్తున్నాయి.

    పవన్ తన కేరిర్ లో రూ.75 కోట్లు వసూలు చేయడం ఇది రెండోసారి. ఇంకో 15 కోట్లు రాబట్టగలిగితే బ్రేక్ ఇవెన్ సాధించినట్టే. వకీల్ సాబ్ 5వ రోజున ఉగాది పండుగ రావడంతో అదనంగా కలిసివచ్చింది. నైజాంతోపాటు ఏపీలోనూ హౌస్ పుల్ తో షోలు నడిచాయి. ఈ చిత్రం 5వ రోజున రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

    వ‌కీల్ సాబ్ ప్ర‌భంజ‌నం ఓవ‌ర్సీస్ లోనూ కొన‌సాగుతోంది. లాక్ డౌన్ త‌ర్వాత విడుద‌లైన ఈ భారీ చిత్రం.. హాలీవుడ్ సినిమాల‌కు ధీటుగా క‌లెక్ష‌న్లు సాధిస్తోంద‌ని చెబుతున్నారు. ఐదోరోజున 14000 డాలర్లు వసూలు చేసింది వకీల్ సాబ్. మొత్తంగా 685కే డాలర్లు అంటే రూ.5.10 కోట్లు వసూలు చేసింది. ఈ రేంజ్ ర‌న్ తో త్వ‌ర‌లోనే 1 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో చేర‌బోతోంది.

    నాలుగో రోజైన సోమ‌వారం కూడా రికార్డు స్తాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగాయ‌ని స‌మాచారం. తెలంగాణ‌తోపాటు ఆంధ్రా ప్రాంతంలోనూ సినిమా కోసం ఆడియ‌న్స్ ఎగ‌బ‌డుతున్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ లో 76 షోలు, వైజాగ్ లో 45 షోలు, విజ‌య‌వాడ‌లో 125 షోలు, నెల్లూరులో 24 షోలు ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. దీంతో.. క‌లెక్ష‌న్ల సునామీ కొన‌సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. నాలుగు రోజుల్లో వ‌కీల్ సాబ్ సాధించిన క‌లెక్ష‌న్ల అంచ‌నా ఇలా ఉంది.

    మొద‌టి రోజుః 40.10 కోట్లు
    రెండో రోజుః 17.10 కోట్లు
    మూడో రోజుః 14.42 కోట్లు
    నాలుగో రోజుః 7.00 కోట్లు(అడ్వాన్స్ బుకింగ్స్)
    ఐదోరోజు: రూ.20 కోట్ల వరకూ..
    ———————-
    మొత్తం : రూ.100 కోట్లు దాటేసిందని అంచనా

    ట్రేడ్ పండితులు అందిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. 5వ రోజుతో రూ‌.100 కోట్ల క్ల‌బ్ లో వకీల్ సాబ్ చేరిందని అంటున్నారు.