https://oktelugu.com/

ఇక టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌‌కే.. ఒత్తిడి ఖాయమా?

జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌.. ఇప్పుడు మూడో తరం హీరోల్లో ఆయన కూడా టాప్‌ ప్లేస్‌లోనే కొనసాగుతున్నారు. స్వతహాగా ఈ స్థాయికి వచ్చిన హీరో ఎన్టీఆర్‌‌. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వచ్చింది నందమూరి ఫ్యామిలీ నుంచే అయినా.. ఏనాడూ ఆయనకు వారి ఫ్యామిలీ నుంచి సపోర్టు దొరికిన దాఖలాలు లేవనేది చాలాసార్లు చూశాం. కొన్ని సందర్భాల్లో అది బయటపడింది కూడా. సీనియర్‌‌ ఎన్టీఆర్‌‌ వారసత్వంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. అనతి కాలంలోనే టాప్‌ హీరోలా జాబితాలో చేరిపోయారు. […]

Written By: , Updated On : April 14, 2021 / 10:44 AM IST
Follow us on

NTR
జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌.. ఇప్పుడు మూడో తరం హీరోల్లో ఆయన కూడా టాప్‌ ప్లేస్‌లోనే కొనసాగుతున్నారు. స్వతహాగా ఈ స్థాయికి వచ్చిన హీరో ఎన్టీఆర్‌‌. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వచ్చింది నందమూరి ఫ్యామిలీ నుంచే అయినా.. ఏనాడూ ఆయనకు వారి ఫ్యామిలీ నుంచి సపోర్టు దొరికిన దాఖలాలు లేవనేది చాలాసార్లు చూశాం. కొన్ని సందర్భాల్లో అది బయటపడింది కూడా. సీనియర్‌‌ ఎన్టీఆర్‌‌ వారసత్వంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. అనతి కాలంలోనే టాప్‌ హీరోలా జాబితాలో చేరిపోయారు.

తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తనకంటూ ఓ బ్రాండ్‌ ఇమేజీని సంపాదించుకున్నారు ఎన్టీఆర్‌‌. ప్రస్తుతం ఆయన సినిమాలతో బిజీ ఉండిపోగా.. ఇప్పుడ ఆయనపై ఓ ఫోర్స్‌ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కేవలం ఎన్నికల వేళ మాత్రమే జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ అలా వెళ్లి.. ప్రచారంలో పాల్గొని వస్తుండేవారు. తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేవారు. అంతే తప్పించి ఏనాడూ ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లో లేరు. పూర్తిస్థాయిలో పార్టీని పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు ఆయనపై పలువురి ఒత్తిడి పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయ స్థితికి చేరుకుంటోంది. తండ్రీకొడుకులైన చంద్రబాబు, లోకేష్‌లపై ఆ పార్టీ క్యాడర్‌‌లో నమ్మకం లేకుండాపోయింది. దీంతో ఇప్పుడు పార్టీకి ఆక్సిజన్‌ అందించే వారి అవసరం ఏర్పడింది. ఈ మేరకు పార్టీ నేతల్లోనూ అసంతృప్తి కనిపిస్తోంది. కొందరైతే బహిరంగంగానే ఆ ఇద్దరి వల్లే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందంటూ విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.. స్వయానా ఇప్పుడు ఆ పార్టీకి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న అచ్చెన్నాయుడు.

అంతేకాదు.. టీడీపీ పుట్టినప్పటి నుంచి పార్టీలో కొనసాగుతున్న మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన తాజాగా స్పందించారు. తన మనసులోని మాటను బయటపెట్టేశారు. ఫైనల్‌గా ప్రతి ఒక్కరి నుంచి జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ రాజకీయాల్లోకి రావాలి.. తెలుగుదేశం పార్టీని బతికించాలనే డిమాండే వినిపిస్తోంది. బుచ్చయ్య కూడా ‘‘ఎన్టీఆర్‌‌ రావాలి.. పార్టీని బతికించాలి”అన్నట్లుగా మాటలు సాగాయి. వీరికితోడు టీడీపీని అభిమానించే పెద్ద సామాజిక వర్గం సైతం ఎన్టీఆర్‌‌ రావాల్సిందేనని పట్టుబడుతోందట.

మరి వీరందరి డిమాండ్‌ను జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ లెక్కలోకి తీసుకుంటారా అనేది తెలియకుండా ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత తనను వాడుకొని వదిలేశారనే ఫీలింగ్‌ ఆయనలో ఉంది. ఇప్పుడు ఎవరెన్ని చెప్పిన ఆయన వినే పరిస్థితి అయితే లేదని తెలుస్తోంది. సినీరంగంలో సక్సెస్‌ ఫుల్‌ జర్నీ సాగిస్తున్న ఆయన సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతారా అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఆయనపై ఒత్తిడి తెచ్చైనా పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలని పలువురు సీనియర్లు పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. వారే రంగంలోకి దిగి ఎన్టీఆర్‌‌ను ఒప్పించేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. చూద్దాం మరి.. తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్‌‌ ఏంటో.