Homeబాలీవుడ్స్టార్ హీరోయిన్‌ ఇంట భారీ విషాదం !

స్టార్ హీరోయిన్‌ ఇంట భారీ విషాదం !

స్టార్ హీరోయిన్‌ అనన్య పాండే ప్రవర్తన చాల బాగుంటుందని, ఆమె వయసు చిన్నది అయినా, ఆమె ఆలోచనా విధానం చాలా పెద్దగా ఉంటుందని, ఆమెకు జీవితం పట్ల, తోటి మనుషుల పట్ల ఎనలేని ఇష్టం ఉంటుందని, పనిని కూడా ఎంతో ఇష్టంగా చేస్తోందని, కచ్చితంగా భవిష్యత్తులో అనన్య గొప్ప స్థాయికి వెళ్తుందని ఇలా బాలీవుడ్ జనం ఎప్పుడూ అనేక రకాలుగా అనన్య పాండేను పొగుడుతూ ఉంటారు.

కానీ ఆ పొగడ్తలకు కారణమైన వ్యక్తి ఇకలేరు. అనన్య పాండే ఇంట భారీ విషాదం నెలకొంది. అనన్య పాండేను ఇలా తీర్చిదిద్దిన ఆమె నాయనమ్మ స్నేహలత పాండే తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న స్నేహలత ఆరోగ్యం నిన్న ఒక్కసారిగా విషమించి చివరకు ఆమె ప్రాణాలు కోల్పోయేలా చేసింది.

దీంతో అనన్య పాండే ఇంట్లో విషాద చాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా అనన్య పాండే ఈ విషాద సంఘటనను అసలు జీర్ణించుకోలేకపోతుంది . ఎందుకంటే.. అనన్య చిన్నప్పటి నుండి నాయనమ్మ చేతిలోనే పెరిగింది. ఎప్పుడు నాయనమ్మనే అంటిపెట్టుకుని ఉండేది. ఇప్పుడు అలాంటి నాయనమ్మ లేరు అనే నిజాన్ని అనన్య అసలు తీసుకోలేకపోతుంది.

సోషల్‌ మీడియా వేదికగా తన ప్రియమైన నాయనమ్మకు కన్నీటి నివాళులు అర్పిస్తూ ఒక ఎమోషనల్ మెసేజ్ ను కూడా పోస్ట్ చేసింది. ‘రెస్ట్‌ ఇన్‌ పవర్‌ మై ఏంజెల్‌. మా నాయనమ్మకు పుట్టుకతోనే గుండె సరిగా లేదని, ఎక్కువ కాలం బతకదు అని ఆమె చిన్నతనంలోనే పెద్ద పెద్ద డాక్టర్లు కూడా తేల్చి చెప్పారట. కానీ వాళ్లకేం తెలుసు, మా నాయనమ్మ పట్టుదల గురించి, 85 ఏళ్ల వయసులోనూ అలుపెరగకుండా పని చేయగలదు అని వాళ్లకేం తెలుసు.

నాకు ఎప్పుడూ గుర్తు ఉండిపోతుంది. ప్దొదున్నే ఏడు గంటలకల్లా మా నాయనమ్మ రెడీ అయి ఉండటాన్ని చూసి నేను ఎప్పుడు ఆశ్చర్యపోయేదాన్ని. ఆమెలో అంత గొప్ప ఓర్పు ఎలా వచ్చిందో.. నేను ఆమె చేతిలో పెరిగి ఇంతటిదాన్ని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది’ అంటూ అనన్య ఎమోషనల్ మెసేజ్ పెడుతూ తన నాయనమ్మతో కలిసి దిగిన చిన్ననాటి ఫొటోను అభిమానులతో పంచుకుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular