శృతి హాసన్ అంటేనే బోల్డ్ హీరోయిన్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. సెట్ లో ఎవరైనా తన వైపు వల్గారిటీతో చూస్తే.. వెంటనే అతని దగ్గరకి వెళ్లి పరువు తీసేవరకూ నిద్ర పోదు. ఈ మధ్య శ్రుతి హాసన్ సినిమా సెట్స్ లో ఇలాంటివి సర్వసాధారణం అయిపోతున్నాయట. అయితే కరోనా సెకెండ్ వేవ్ లతో షూటింగ్స్ కి బ్రేక్ వచ్చింది కాబట్టి.. ఖాళీగా కూర్చోకుండా మొన్న ఫోటోషూట్ లు చేసింది.
ఆ ఫోటోషూట్లు ఏమో జనాలని భయపెట్టేలా దరిద్రంగా ఉండటంతో నెటిజన్లు ఆమె పై విరుచుకుపడుతున్నారు. దానికితోడు శ్రుతి హాసన్ వికృతి స్టిల్స్ పై మీడియాలో కూడా బ్యాడ్ గా వార్తలు వచ్చాయి. నెటిజన్లు బ్యాడ్ కామెంట్స్, మీడియా విమర్శలు అన్నిటినీ తీరిగ్గా చూసుకున్న శ్రుతిహాసన్ మొత్తానికి తనదైన శైలిలో స్పందిస్తూ రెచ్చిపోయింది.
శ్రుతి హాసన్ మాటల్లోనే.. ‘మనం వేసుకునే డ్రెస్, కాలాన్ని బట్టి అదేవిధంగా ఫ్యాషన్ బట్టి మారుతుంటాయి. నేను ఎప్పుడు ఫ్యాషన్ కి చాల ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇక ఇప్పుడు చాలా విచిత్రంగా అనిపించే ఫ్యాషనే.. కొన్ని సంవత్సరాల తరువాత చాల రెగ్యులర్ గా ట్రెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మనకు నచ్చింది చెయ్యాలి, నాకు నచ్చినట్లు ఉంటా. నాకు నచ్చిందే చేస్తా. మీరు కూడా మీకు ఎలా సంతోషం కలుగుతుందో అలా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చింది.
ఏది ఏమైనా శృతి హాసన్ అంటేనే మల్టీ టాలెంటెడ్. ఇక హీరోయిన్ గా కూడా శృతి ఈ మధ్య ఉన్నట్టుండి గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేస్తూ పోవడానికి కారణం సరైన ఛాన్స్ లు అమ్మడికి రావడం లేదట. అయితే విచిత్రంగా వయసు పెరిగేకొద్దీ ఎక్స్ పోజింగ్ కూడా పెంచుకుంటూ పోవడమే ఈ సీనియర్ బ్యూటీ పై బ్యాడ్ కామెంట్స్ కి కారణమవుతుంది. ప్రస్తుతం, శృతి హాసన్ ప్రభాస్ సరసన ‘సలార్’ సినిమాలో నటిస్తోంది.