
బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ ను మొదలు పెట్టింది. ఇప్పటిదాకా కేవలం 5 భాషల్లో మాత్రమే రిలీజ్ కు ప్లాన్ చేయగా.. ఇప్పుడు మొత్తం 11 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
ఇప్పటికే 5 భాషలకు సంబంధించి 348 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ ను క్లోజ్ చేసింది ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్. ఈ మొత్తమే సినిమా టోటల్ బడ్జెట్ తో సమానం అట.. అంటే పెట్టిన పెట్టుబడి ఇప్పటికే వెనక్కి వచ్చేసిందన్న మాట..
తెలుగు-హిందీ భాషల్లో ప్రస్తుతానికి ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతానికైతే తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తారు. ఆ తర్వాత ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేసి ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక శాటిలైట్, డిజిటల్, ఆడియోతోపాటు ఇతర హక్కులన్నీ కలిపి రూ.250 కోట్ల రూపాయలు అవుతాయని అంచనావేశారు. స్టార్ మా, అమేజాన్ తో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారని.. హిందీ సహా ఇతర భాషల్లో రైట్స్ తో భారీ లాభాలు రావడం ఖాయమంటున్నారు.
ఇప్పటికే 350 కోట్లతో తెరకెక్కిస్తున్న ఈ మూవీ దాదాపు 700 కోట్ల రూపాయల ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్టు టాక్. అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది.