Homeఎంటర్టైన్మెంట్Prashanth Neel KGF 2: ఏది పెద్ద హిట్.. ఎవ‌రు గొప్ప డైరెక్టర్.. త్రిబుల్ ఆర్...

Prashanth Neel KGF 2: ఏది పెద్ద హిట్.. ఎవ‌రు గొప్ప డైరెక్టర్.. త్రిబుల్ ఆర్ తో కేజీఎఫ్-2 ను పోలుస్తున్న ఫ్యాన్స్..

Prashanth Neel KGF 2: భారీ అంచ‌నాల న‌డుమ‌ కేజీఎఫ్ ఛాప్టర్ 2 ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజై హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 భారీ సక్సెస్ సాధించడంతో చాప్ట‌ర్ 2 కి విప‌రీత‌మైన హైప్ వ‌చ్చింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో భాష‌ల‌లో కేజీయఫ్ 2 ఒకే రోజు విడుద‌లైంది. తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ కాగా బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్ర పోషించారు.

Prashanth Neel KGF 2
Prashanth Neel KGF 2

ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి స్పందనను అందుకున్న ఈ మూవీకి ఓవరాల్‌గా మంచి టాక్ వచ్చింది. అలాగే, రివ్యూలు కూడా చాలా పాజిటివ్‌గా వచ్చాయి. ఈ సినిమా ఫలితంతో అటు హీరో ఫ్యాన్స్.. ఇటు చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉందని చెప్పొచ్చు. నైజాంలో మొదటి రోజు ఏకంగా రూ. 9.68 కోట్లు కలెక్ట్ చేసింది. ఎక్కువ వసూళ్లను అందుకున్న మొట్టమొదటి డబ్బింగ్ సినిమాగా ఇది ఆల్‌టైమ్ రికార్డును నమోదు చేసుకుంది. తెలుగు వాళ్లు ఈ సినిమాను ఎంత ఆద‌రించారో అర్థం చేసుకోవ‌చ్చు.

Also Read: RRR Actor Ajay Devgn: తప్పు చేసి జైలు పాలైన RRR నటుడు అజయ్ దేవగన్

అయితే మొద‌ట‌గా బాహుబ‌లి2 తో పాన్ ఇండియా లెవ‌ల్ ని క్రియేట్ చేసిన రాజ‌మౌళి.. ఆ త‌ర్వాత అదే లెవ‌ల్ లో కేజీఎఫ్ తో ప్ర‌శాంత్ నిల్ క్రెయేట్ చేశాడు. రీసెంట్ గా వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ తో మ‌రోసారి రాజ‌మౌళి ప్రూవ్ చేశాడు. అలాగే ప్ర‌శాంత్ నిల్ కూడా చాప్ట‌ర్ 2తో ఆదే రేంజ్ క్రియేట్ చేశాడు. దీంతో ఇప్పుడు ఇద్ద‌రిలో ఎవ‌రు గొప్ప అనే చ‌ర్చ న‌డుస్తోంది.

Prashanth Neel KGF 2
KGF 2

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలలో ఏది పెద్ద హిట్ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఆర్ఆర్ఆర్ నచ్చితే హీరోయిజం ఎలివేషన్ సన్నివేశాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం కేజీఎఫ్2 నచ్చుతుంది.రాజమౌళికి ప్రశాంత్ నీల్ రాబోయే రోజుల్లో కూడా గట్టి పోటీ ఇవ్వగలడని కేజీఎఫ్2 తో ఫిక్స్ అయింది.కేజీఎఫ్2 సినిమాలో కొన్ని సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ అనేలా ఉన్నాయి. కాగా ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్ అయ్యేలా ఉన్నాయ‌ని కూడా కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

బాలీవుడ్ ఆడియన్స్ ఈ సినిమాకు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. అయితే కేజీఎఫ్2 బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేసే అవకాశం అయితే లేదు. కేజీఎఫ్2 సక్సెస్ తో ప్రభాస్, ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషిలో ఉంటున్నారు. అయితే సౌత్ ఇండ‌యా సినిమాని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేస్తున్న రాజమౌళి, ప్రశాంత్ నీల్ఇద్దరూ గొప్ప డైరెక్టర్లు అనే చెప్పాలి.

Also Read: Tollywood Young Hero: ఇద్ద‌రితో ఎఫైర్ నడిపిస్తున్న యంగ్ హీరో.. ఒక‌రికి తెల‌వ‌కుండా మ‌రొక‌రితో.. చివరకు

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

Comments are closed.

Exit mobile version