https://oktelugu.com/

మీ కోడలు కావాలన్నదే నా కోరిక – రష్మిక మండన్నా

కన్నడ భామ ‘రష్మిక మండన్నా’కి లౌక్యం ఎక్కువ. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవర్నీ ఎక్కడ ఎలా ఉంచాలో రష్మికకి బాగా తెలుసు. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉంది. అయితే, రష్మిక ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలను పక్కన పెడుతుంది. ఓన్లీ టాప్ స్టార్స్ తో మాత్రమే నటించాలని ఆశ పడుతుంది. ఇందులో భాగంగా తమిళంలో టాప్ స్టార్ హీరో విజయ్ తో ఓ […]

Written By:
  • admin
  • , Updated On : May 13, 2021 / 02:35 PM IST
    Follow us on


    కన్నడ భామ ‘రష్మిక మండన్నా’కి లౌక్యం ఎక్కువ. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవర్నీ ఎక్కడ ఎలా ఉంచాలో రష్మికకి బాగా తెలుసు. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉంది. అయితే, రష్మిక ఇప్పుడు మిడ్ రేంజ్ హీరోలను పక్కన పెడుతుంది. ఓన్లీ టాప్ స్టార్స్ తో మాత్రమే నటించాలని ఆశ పడుతుంది.

    ఇందులో భాగంగా తమిళంలో టాప్ స్టార్ హీరో విజయ్ తో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమా టీమ్ ఆ తరువాత రష్మికకు ఏ విషయం చెప్పలేదు. అందుకే, తమిళంలో కావాలని తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. తమిళ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను సైతం మెప్పించడానికి మొత్తానికి తన తెలివితేటలను విజయవంతంగా ప్రదర్శించింది.

    రష్మిక మాట్లాడుతూ.. ‘నాకు తమిళ సంస్కృతి అంటే చాల ఇష్టం. ఎందుకంటే తమిళ సంప్రదాయం చాలా విభిన్నంగా ఉంటుంది. అందుకేనేమో ఇక్కడి సంప్రదాయం నన్ను ఎంతగానో ఆకర్షించింది. నాకు తమిళనాడులో చాల వాటితో మంచి అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా తమిళనాడు భోజనం అంటే ఎంతో ఇష్టం. ఇక్కడి వంటలు నాకు చాలా రుచికరంగా అనిపిస్తాయి.

    అందుకే నేను మా ఇంట్లో బెంగళూరులో ఉన్నా.. తమిళ వంటకాలనే ఎంతో ఇష్టంగా తింటున్నాను. అంత అమితమైన ఇష్టం నాకు తమిళనాడు రుచులు అంటే. అందుకే ఎప్పటికైనా నేను తమిళ ఇంటి కోడలు కావాలన్నదే నా కోరిక’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి కన్నడ యంగ్ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమను ఏం చేస్తోందో ? ఏది ఏమైనా ఏ రాష్ట్రానికి వెళ్తే.. అక్కడి వాళ్ళను పొగడడం రష్మిక బాగా నేర్చుకుంది.