https://oktelugu.com/

రఘురామ కేసు సీబీఐకేనా?.. చిక్కుల్లో జగన్

రఘురామ కృష్ణం రాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటానని చెప్పడంతో కేసు రోజుకో విధంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆయన విడుదలపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయనపై ప్రయోగించిన థర్డ్ డిగ్రీ అంశంపై సీబీఐ లేదా మరో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరిపే అవకాశాలున్నాయి. సీబీఐ లేదా మరో జాతీయ […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 25, 2021 / 05:41 PM IST
    Follow us on


    రఘురామ కృష్ణం రాజు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటానని చెప్పడంతో కేసు రోజుకో విధంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆయన విడుదలపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.

    ఆయనపై ప్రయోగించిన థర్డ్ డిగ్రీ అంశంపై సీబీఐ లేదా మరో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరిపే అవకాశాలున్నాయి. సీబీఐ లేదా మరో జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రఘురామ కొడుకు దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్రం, సీబీఐలను ప్రతివాదులుగా పేర్కొంటూ కౌంటర్ ధాఖలు చేయాలని చెప్పింది. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ తోపాటు సీబీఐలను పేర్కొనలేదు. రఘురామ కుమారుడు దాఖలు చేసిన పిటిషన్ లోనే వారిని ప్రతివాదులుగా తొలగించారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం, సీఐడీలను ప్రతివాదులుగా తొలగించడంపై ఏపీ ప్రభుత్వం న్యాయవాది దుష్యంత్ దనే అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని ప్రతివాదులగా చేర్చాలలని కోరినా ధర్మాసనం అంగీకరించలేదు. తమ రిస్క్ మీదే ప్రతివాదులను తొలగించామని రఘురామ కుమారుడు తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. దీంతో 6 వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది. వాదనలు వినకుండా ఏ నిర్ణయం తీసుకోబోమని చె ప్పిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వే సింది.

    ప్రతివాదులుగా కేవలం కేంద్రం, సీబీఐలను మాత్రమే చేర్చడంతో వారు సీబీఐ విచారణకు అనుకూలంగానే కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే ఆర్మీ ఆస్పత్రి నివేదికలో రఘురామ కాలికి గాయాలయ్యాయని నివేదిక పేర్కొంది. ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న అంశాన్ని తేలికగా తీసుకునే అవకాశం లేదు. విచారణ చేస్తారా అంటే చేయలేమని చెప్పే పరిస్థితి సీబీఐకి లేదు. దీంతో సీబీఐ విచారణ జరగడానికి ఎ క్కువ అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.