https://oktelugu.com/

రామ్ తో మాస్ డైరెక్టర్.. కొత్త నేపథ్యంలో !

సినిమా ఇండస్ట్రీ అంటేనే సక్సెస్ మీద నడుస్తోంది. సక్సెస్ వస్తే నెత్తిన పెట్టుకుంటారు, లేదంటే ఆఫీస్ బాయ్ కూడా సరిగ్గా పట్టించుకోడు. అందుకే ఇక్కడంతా సక్సెస్ మయం. ఇక టాలీవుడ్ లో మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వివి వినాయక్ పరిస్థితి ప్రస్తుతం ఎవ్వరూ పట్టించుకోని స్థితిలోనే ఉంది. స్టార్ డైరెక్టర్ గా ఇమేజ్ తెచ్చుకున్న వినాయక్ అంటే అందరి హీరోలకు ప్రత్యేక అభిమానం ఉంది. ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చరణ్ ఇలా అందరూ వినాయక్ […]

Written By:
  • admin
  • , Updated On : April 3, 2021 / 01:57 PM IST
    Follow us on


    సినిమా ఇండస్ట్రీ అంటేనే సక్సెస్ మీద నడుస్తోంది. సక్సెస్ వస్తే నెత్తిన పెట్టుకుంటారు, లేదంటే ఆఫీస్ బాయ్ కూడా సరిగ్గా పట్టించుకోడు. అందుకే ఇక్కడంతా సక్సెస్ మయం. ఇక టాలీవుడ్ లో మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వివి వినాయక్ పరిస్థితి ప్రస్తుతం ఎవ్వరూ పట్టించుకోని స్థితిలోనే ఉంది. స్టార్ డైరెక్టర్ గా ఇమేజ్ తెచ్చుకున్న వినాయక్ అంటే అందరి హీరోలకు ప్రత్యేక అభిమానం ఉంది. ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, చరణ్ ఇలా అందరూ వినాయక్ అంటే ఇష్ట పడతారు. వీరందరికీ వినాయక్ ఒకప్పుడు హిట్ ఇచ్చాడు.

    కానీ, వినాయక్ ప్రస్తుతం బ్యాడ్ టైంలో కొట్టుమిట్టాడతా ఉంటే.. ఒక్క హీరో కూడా పిలిచి డేట్స్ ఇస్తా అని అనడం లేదట. అందుకే వినాయక్ కూడా వారి కోసం ప్రయత్నాలు చేయడానికి ఇష్ట పడటం లేదు. నిజానికి ఎన్టీఆర్ తో అదుర్స్ 2 చేయాలని వినాయక్ కథ కూడా రెడీ చేసుకున్నాడు. కానీ, ఎన్టీఆర్ ఇప్పుడు వినాయక్ కి డేట్స్ ఇచ్చే పరిస్థితిలో లేడు. అలాగే మిగిలిన హీరోలు కూడా ఉన్నారు. అందుకే, నిర్మాత సి కళ్యాణ్ బ్యానర్ లో నందమూరి బాలయ్యతో సినిమా చేయాలని మళ్ళీ రెండు నెలలు క్రితం ప్రయత్నాలు చేస్తోన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మళ్ళీ మరో వార్త వినిపిస్తోంది.

    వినాయక్ తో హీరో రామ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ మధ్యే రిలీజ్ అయిన రెడ్ ప్లాప్ దెబ్బకు ప్రస్తుతం రామ్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఒక్క హిట్ వస్తే.. ఆ తరువాత వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న రామ్ కి, వినాయక్ కొత్త నేపథ్యంలో చేస్తోన్న సినిమాతో ఏ రేంజ్ హిట్ ను ఇస్తాడో చూడాలి. త్వరలోనే వీరి కలయికలో సినిమా సెట్స్ పైకి రానుంది.

    అయినా మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తూ చేసిన ఖైదీ నంబర్ 150 సినిమాని సూపర్ హిట్ చేసిన వినాయక్, టాలీవుడ్ లో 125 కోట్ల వసూళ్లు రాబట్టి డైరెక్టర్ గా తన స్టామినా ఏమిటో ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ మరో హిట్ వస్తే.. వినాయక్ పై స్టార్స్ కు నమ్మకం కుదరదు.