రాధికా ఆప్టే.. ఒకటి రెండు వీడియోలతో సంచలనం అయిపోయింది. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించడం.. పైగా ఆమెను డీసెంట్ లుక్స్ లో తెలుగు దర్శకులు చూపించడంతో ఆమె పై ఒక ఇమేజ్ క్రియేట్ అయింది తెలుగు వాళ్లకు. అలాంటి డీసెంట్ హీరోయిన్ నుండి బోల్డ్ గెటప్స్ చూసే సరికి అందరూ షాక్ అయ్యారు. ఏది ఏమైనా రాధికా ఆప్టే ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది.
ముఖ్యంగా మొదటి నుండి ఆమె సినిమాల సెలక్షన్ కూడా మరీ విచిత్రంగా సాగింది. ఒక సంచార జీవిలా హాలీవుడ్ నుండి బాలీవుడ్, అక్కడ నుండి మరాఠీ సినిమాల్లోకి, మధ్యమధ్యలో తెలుగు సినిమాల్లోకి.. ఆ తరువాత ప్రపంచ సినిమా … ఇలా ఎక్కడా సంబంధం లేని సినీ లోకాల్లో విహరిస్తూ అన్ని భాషల సినిమాలు చేసుకుంటూ.. ఒక్క భాషలో కూడా స్టార్ హీరోయిన్ అనే క్రెడిట్ ను సాధించకపోయినా దిగులు పడకుండా.. దొరికిన చిన్నాచితకా చిత్రాల్లో కూడా నటిస్తూ అలా ముందుకు వెళ్తుంది రాధికా.
అయితే ఈ మొత్తం సినీ ప్రయాణంలో రాధికా ఇంటిపట్టున ఉన్నది చాల తక్కువ అట. నటి అయిన దగ్గర నుండి కెరీర్ మీద ఫోకస్ పెట్టి అన్ని ఇండస్ట్రీల చుట్టూ తిరుగుతూ.. మొత్తానికి గత కొన్ని సంవత్సరాలుగా ఫ్యామిలీ లైఫ్ కి ఆమె చాల దూరం అయిందట. కానీ కోవిడ్ తర్వాత ఆమెలో మార్పు వచ్చిందట.
రాధికా మాటల్లోనే ‘లాక్ డౌన్ సమయంలో నాకు ఫ్యామిలీ విలువ తెలిసొచ్చింది. మన ఇల్లు ముఖ్యం అని అర్థమైంది. తల్లితండ్రులు, మన వాళ్ళు మాత్రమే మనకి ఎప్పుడూ తోడ్పాటుగా ఉంటారని తెలుసుకున్నాను. అంటూ చెప్పుకొచ్చింది రాధికా. ప్రపంచం అంతా చుట్టినా … ఫైనల్ గా ఇంట్లోనే సెటిల్ కావాలన్న విషయాన్ని ఇప్పటికైనా అర్ధం చేసుకున్నందుకు సంతోషం.