ఇండస్ట్రీలో మార్కెట్ లేని హీరో అంటే అందరికీ చులకనే. అదే ఒకటి రెండు హిట్లు వచ్చిన హీరోకు చిన్నపాటి మార్కెట్ ఉన్నా అడ్వాన్స్ లు ఇవ్వడానికి తెగ ఉబలాట పడతారు నిర్మాతలు. అయితే బాలయ్య బాబుకు మాత్రం ఏ నిర్మాత అడ్వాన్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. బాలయ్య పేరు వింటేనే ఏ నిర్మాత ఇంట్రస్ట్ చూపించడం లేదు. మొత్తానికి బాలయ్యతో సినిమా అంటేనే పెద్ద రిస్క్ అనే స్టేజ్ లోకి వెళ్ళిపోయింది బాలయ్య మార్కెట్ పరిస్థితి. నిజంగా ఇది బాలయ్య అభిమానులకు బాధ కలిగించే అంశమే.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హీరోకి ఇలాంటి పరిస్థితా ? అయితే, రవితేజ లాంటి హీరోలకు మార్కెట్ ఉన్నా గొప్ప కలెక్షన్స్ రావు. సినిమా హిట్ అయింది అంటే.. ఏదో ఏభై కోట్లు వరకూ వస్తాయి. అదే బాలయ్య సినిమా హిట్ అనే టాక్ వస్తే.. 80 కోట్లు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. అయినా ఎందుకు బాలయ్యతో సినిమాకి ఎవరూ రెడీగా లేరు. మార్కెట్ పరంగా బాలయ్య సినిమాలు ఈ మధ్య బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను సాధించలేక చేతులు ఎత్తేస్తోన్నాయి. ఇదే కారణం చూపించి ఒక్క నిర్మాత కూడా బాలయ్యతో యస్ చెప్పడం లేదట.
దాంతో బోయపాటి సినిమాకి బడ్జెట్ కూడా తగ్గించారు ఆ సినిమా నిర్మాత. కేవలం బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకునే బోయపాటి స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసి.. అనుకున్నదాని కంటే బడ్జెట్ లో దాదాపు ఇరవై కోట్లు తగ్గించాడు. అయితే తాజాగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బాలయ్యని కూడా రెమ్యునరేషన్ తగ్గించుకోవల్సిందిగా కోరాడట. బాలయ్య అది అవమానంగా ఫీల్ అయి సినిమా సెట్స్ నుండి మధ్యలోనే ప్యాకప్ చెప్పి వెళ్లిపోయారట.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్