https://oktelugu.com/

హీరోయిన్ ఇల్లు చూసి కుళ్ళుకుంటున్న స్టార్స్ !

గ్లోబల్‌ స్టార్‌ గా ప్రస్తుతం తన సినీ కెరీర్ ను కొనసాగిస్తోన్న ‘ప్రియాంక చోప్రా’ అమెరికాలో లాస్‌ ఏంజిల్స్‌ లో తనకంటూ ఒక అందమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏమిటి ఆ ప్రపంచం అనుకుంటున్నారా ? అమ్మడు తన భర్త నిక్‌ తో కలిసి ఒక రాజభవనం వంటి బంగ్లాను అంగరంగ వైభవంగా తళుకులు బెళుకులతో మెరిసిపోయేలా కట్టించుకుంది. కాగా లాస్‌ ఏంజిల్‌ లో ‘ప్రియాంక చోప్రా’ ఇంటి ఖరీదు దాదాపుగా 20 మిలియన్‌ ల డాలర్లు […]

Written By:
  • admin
  • , Updated On : April 1, 2021 / 05:30 PM IST
    Follow us on


    గ్లోబల్‌ స్టార్‌ గా ప్రస్తుతం తన సినీ కెరీర్ ను కొనసాగిస్తోన్న ‘ప్రియాంక చోప్రా’ అమెరికాలో లాస్‌ ఏంజిల్స్‌ లో తనకంటూ ఒక అందమైన ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుంది. ఏమిటి ఆ ప్రపంచం అనుకుంటున్నారా ? అమ్మడు తన భర్త నిక్‌ తో కలిసి ఒక రాజభవనం వంటి బంగ్లాను అంగరంగ వైభవంగా తళుకులు బెళుకులతో మెరిసిపోయేలా కట్టించుకుంది.

    కాగా లాస్‌ ఏంజిల్‌ లో ‘ప్రియాంక చోప్రా’ ఇంటి ఖరీదు దాదాపుగా 20 మిలియన్‌ ల డాలర్లు అట. ఇండియన్‌ కరెన్సీలో చూస్తే అక్షరాల రూ.144 కోట్లు. పైగా ఈ బంగ్లాలోని ఇంటీరియర్‌ మరియు ఫర్నీచర్‌ ప్రపంచ ప్రసిద్ది గాంచిన సంస్థలు ప్రత్యేకంగా తయారు చేశాయట. ఇల్లు అద్బుతమైన లొకేషన్‌ లో ఉండటంతో పాటు ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న విషయంలోనూ భారీగా ఖర్చు చేసినట్లుగా ‘ప్రియాంక చోప్రా’ సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.

    మొత్తానికి బాలీవుడ్‌ లో ఏ స్టార్‌ హీరోకి కూడా లేనంత ఖరీదైన ఇల్లును సొంతం చేసుకుంది ప్రియాంక. అందుకే ఆమె బంగ్లా చూసి భారతీయ సినీ ప్రముఖులు కూడా కుళ్ళుకుంటున్నారని బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది అంటేనే అమ్మడు రేంజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆ మాటకొస్తే బాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ‘ప్రియాంక చోప్రా’ బాలీవుడ్‌ లో అత్యధికంగా పారితోషికంగా తీసుకునే హీరోయిన్ గా ఎదిగింది.

    ఇక ప్రియాంక చోప్రా భర్త నిక్ విషయానికి వస్తే.. అతను అమెరికాలోనే టాప్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌ ను నిర్వహిస్తూ ఏడాదికి వందల కోట్లను సంపాదిస్తున్నాడు. అతను సంపాదన కూడా తోడు అవ్వడంతోనే ప్రియాంక లాస్‌ ఏంజిల్స్‌ లో
    ఇంత గొప్ప ఇల్లు కట్టుకుందని ఆమె అంటే గిట్టని వాళ్ళు దెప్పి పొడుస్తున్నారు.